Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' IRCTC, Fusion, Ultratech, Uno Minda
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 14 December 2023: ఈ రోజు ఇండియన్ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ బంపర్ స్టార్ట్ ఇచ్చే ఆస్కారం ఉంది. వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించిన యూఎస్ ఫెడ్, వచ్చే ఏడాది కనీసం 3 రేట్ కట్స్‌పై సిగ్నల్స్ ఇచ్చారు. దీంతో ప్రపంచ మార్కెట్లలో ఈక్విటీల ర్యాలీకి గట్టి ప్రోత్సాహం లభించింది.
గరిష్ట స్థాయుల్లో అమెరికన్ మార్కెట్స్
యుఎస్‌లో, డౌ జోన్స్ 1.4 శాతం ఎగబాకి తాజా గరిష్టాన్ని తాకింది. S&P 500 & నాస్‌డాక్ కాంపోజిట్ కూడా 1.38 శాతం చొప్పున లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్స్ మిక్స్‌డ్
ఆసియా మార్కెట్లలో... నికాయ్ 0.3 శాతం క్షీణించింది. హాంగ్ సెంగ్, కోస్పి, S&P /ASX 200 1.4 శాతం చొప్పున పెరిగాయి.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 19 పాయింట్లు లేదా 0.09% రెడ్ కలర్‌లో 21,224 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
IRCTC: నాన్-రైల్వే క్యాటరింగ్ బిజినెస్‌ను పాన్-ఇండియాలో భారీగా విస్తరించేందుకు ప్లాన్ చేసింది. హాస్పిటాలిటీ, క్యాటరింగ్‌లో మేజర్ బ్రాండ్‌గా మారాలనే లక్ష్యంతో ఇప్పటికే వివిధ ప్రభుత్వ & స్వయం ప్రతిపత్త సంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్: గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్‌కు చెందిన హనీ రోజ్ ఇన్వెస్ట్‌మెంట్, ఈ రోజు బ్లాక్ డీల్ ద్వారా ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్‌లో 9.25 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది. డీల్ సైజ్ రూ.500 కోట్లు, ఒక్కో షేర్‌కు ఫ్లోర్ ప్రైస్ రూ.535.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): భారత్‌లో సోలార్ PV ప్రాజెక్ట్‌లకు రుణాలు ఇవ్వడానికి... KfWతో (జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 70 మిలియన్ యూరోల విలువైన క్రెడిట్ లైన్ కోసం ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంటోంది.
అల్ట్రాటెక్ సిమెంట్: 2030 నాటికి, తన మొత్తం ఎనర్జీ మిక్స్‌లో గ్రీన్ ఎనర్జీ వాటాను 85 శాతానికి పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. FY26 నాటికి దీని గ్రీన్ ఎనర్జీ వాటాను ప్రస్తుతమున్న 22 శాతం నుంచి 60 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
యునో మిండా: అహ్మదాబాద్‌లోని భాగపురాలోని అనుబంధ సంస్థ యునో మిండా టాచీ-ఎస్ (UMTS) సీటింగ్ ద్వారా కొత్త ఆటోమోటివ్ సీటింగ్ సిస్టమ్స్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్, ప్యాసింజర్ కార్ల కోసం ఆటోమోటివ్ సీట్ల కోసం మెకానికల్ భాగాలను తయారు చేస్తుంది. UMTS ఇప్పటికే OEMల నుంచి ఆర్డర్‌లు అందుకుంది. Q4FY24 నాటికి సప్లై ప్రారంభించాలని భావిస్తోంది.
RBL బ్యాంక్: ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్‌లో (ONDC) రూ. 40 కోట్లతో 8.51 శాతం వాటాను సొంతం చేసుకుంది.
PNC ఇన్‌ఫ్రాటెక్: తన అనుబంధ సంస్థ వివాదాన్ని పరిష్కరించేందుకు NHAI నుంచి రూ. 394 కోట్లకు అంగీకారం తెలిపింది.
NBCC (ఇండియా): కంపెనీ NCDC నుంచి రూ.1,500 కోట్ల ఆర్డర్ అందుకుంది.
బయోకాన్: బయోటెక్ కంపెనీకు చెందిన బికారా థెరప్యూటిక్స్, 165 మిలియన్ డాలర్ల సిరీస్ C ఫైనాన్సింగ్ రౌండ్‌ను పూర్తి చేసింది. ఇకపై ఇది బయోకాన్ అనుబంధ సంస్థ కాదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: స్టాక్స్ కాదు, సూపర్ స్టార్స్ - సెన్సెక్స్ 40k-70k ర్యాలీలో ఇవే తారాజువ్వలు