News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Stocks To Watch 27 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Infy, HealthCare Global, Century Tex

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stock Market Today, 27 September 2023: ఇవాళ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 1.0 పాయింట్లు లేదా 0.01 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,733 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

సిగ్నేచర్‌గ్లోబల్ (ఇండియా): గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం ఈ స్టాక్‌ 10 శాతం వరకు లిస్టింగ్ లాభాలు చూడవచ్చు. రూ.730 కోట్ల IPO 11.9 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. కంపెనీ ఒక్కో షేరును రూ.385 చొప్పున జారీ చేసింది.

సాయి సిల్క్స్ (కళామందిర్): రూ.1,201 కోట్ల IPO 4.4 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఒక్కో షేర్ ఇష్యూ ధర రూ.222.

డెల్టా కార్ప్: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ నుంచి వసూలు కావల్సిన పన్ను రూ. 1 లక్ష కోట్లకు చేరుకోవచ్చన్న రిపోర్ట్స్‌ మధ్య, ఈ కంపెనీ షేర్లు ఫోకస్‌లో ఉంటాయి. మరోవైపు, అక్టోబర్ 07న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది.

ఇన్ఫోసిస్: ఇన్ఫోసిస్ టోపాజ్, అజూర్ ఓపెన్‌ఏఐ సర్వీస్, అజూర్ కాగ్నిటివ్ సర్వీసెస్ ద్వారా పరిశ్రమ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఐటీ మేజర్ మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఇన్ఫోసిస్ పని చేస్తుంది.

సిప్లా: ఈ ఫార్మా కంపెనీ, స్కైప్ ఎయిర్ మొబిలిటీ భాగస్వామ్యంతో, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఆసుపత్రులు & ఫార్మసీలకు డ్రోన్ల ద్వారా కీలక ఔషధ డెలివరీలను ప్రారంభించింది.

హెల్త్‌కేర్ గ్లోబల్: CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్ ఈ కంపెనీలో 60.4 శాతం వరకు వాటాలను విక్రయించడానికి అన్వేషిస్తోంది. రిపోర్ట్స్‌ ప్రకారం, CVC వాటా విలువ సుమారు 345 మిలియన్‌ డాలర్లు.

3i ఇన్ఫోటెక్: ఐదేళ్ల పాటు వినియోగదారు మద్దతు సేవలు అందించడానికి, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి రూ. 39.55 కోట్ల కాంట్రాక్ట్‌ పొందింది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్: కస్టమర్‌లు, ఉద్యోగులు, క్రికెట్ అభిమానులకు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో (ICC) బహుళ-సంవత్సరాల ప్రపంచ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ధనలక్ష్మి బ్యాంక్: బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా కెఎన్ మధుసూదనన్ నియామకానికి RBI ఆమోదం తెలిపింది.

వేదాంత: వేదాంత రిసోర్సెస్ కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్‌ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది. రాబోయే రుణ మెచ్యూరిటీలకు రీఫైనాన్సింగ్ చేయడంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఈ కోత పెట్టింది. వేదాంత జారీ చేసిన సీనియర్ అన్‌సెక్యూర్డ్ బాండ్లపై రేటింగ్‌ను కూడా మూడీస్‌ తగ్గించింది.

REC, పంజాబ్ నేషనల్ బ్యాంక్: 55,000 కోట్ల రూపాయల మేరకు విద్యుత్ & ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు కో-ఫైనాన్స్ చేయడానికి ఈ రెండు కంపెనీలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

సుజ్లాన్ ఎనర్జీ: 2020 వాటాదార్ల ఒప్పందాన్ని దిలీప్ షాంఘ్వీ & అసోసియేట్స్ రద్దు చేసింది, ఆ సంస్థ నామినీ డైరెక్టర్ హిటెన్ టింబాడియా సజ్లాన్‌ బోర్డు నుంచి వైదొలిగారు.

సెంచరీ టెక్స్‌టైల్స్: ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ విభాగం బిర్లా ఎస్టేట్స్, బెంగళూరులోని బిర్లా త్రిమయ ప్రాజెక్ట్‌ మొదటి దశను ప్రారంభించిన 36 గంటల్లోనే రూ.500 కోట్ల సేల్స్‌ చేసింది.

NDTV: ఈ బ్రాడ్‌కాస్టర్, HDలో (హయ్యర్ డెఫినిషన్) మూడు న్యూస్ & కరెంట్ అఫైర్స్ ఛానెల్స్‌ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అందుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: డ్రీమ్‌ 11కు రూ.25,000 కోట్ల జీఎస్టీ నోటీసు! ఇండస్ట్రీకి లక్ష కోట్ల నోటీసులు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 27 Sep 2023 08:13 AM (IST) Tags: Stock Market Update Infy Stocks to Buy Stocks in news HealthCare Global Century Tex

ఇవి కూడా చూడండి

Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

టాప్ స్టోరీస్

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ