Stocks To Watch 27 October 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' RIL, Maruti, Vodafone
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 27 October 2023: గురువారం నిఫ్టీ 19,000 మార్కు దిగువకు జారడంతో దేశీయ ఈక్విటీస్ వరుసగా ఆరో రోజూ ఒత్తిడిలో కొనసాగాయి.
US స్టాక్స్ పతనం
మిశ్రమ త్రైమాసిక ఆదాయాలు, ఆర్థిక వ్యవస్థల సంకేతాల కారణంగా టెక్, టెక్ సంబంధింత మెగా క్యాప్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి, US మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు గతంలో ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగొచ్చన్న అంచనాలు దీనికి కారణం.
పెరిగిన ఆసియా స్టాక్స్
వాల్ స్ట్రీట్ ముగిసిన తర్వాత, US టెక్ ఆదాయాలు పుంజుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. పెట్టుబడిదార్లలో మళ్లీ ఆశలు చిగురించడంతో ఆసియా ఈక్విటీలు పెరిగాయి.
ఈ రోజు ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 78 పాయింట్లు లేదా 0.41 శాతం గ్రీన్ కలర్‌లో 18,990 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, SBI లైఫ్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
వొడాఫోన్ ఐడియా: 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఏకీకృత నికర నష్టం రూ. 8,738 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం స్వల్పంగా 0.9% పెరిగి రూ. 10,716 కోట్లకు చేరుకుంది. పన్ను చెల్లింపుల కోసం రూ. 822 కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో కలిపితే మొత్తం రూ. 16,567 కోట్ల నష్టాన్ని ఈ టెలికాం కంపెనీ ప్రకటించింది.
లక్ష్మి ఆర్గానిక్: Q2 FY24లో లక్ష్మి ఆర్గానిక్ రూ. 10.7 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. కార్యకలాపాల ద్వారా రూ. 652 కోట్ల ఆదాయాన్ని ఈ కంపెనీ ఆర్జించింది.
రైల్‌టెల్: FY24 రెండో త్రైమాసికంలో రైల్‌టెల్ నికర లాభం రూ. 68 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో ఆదాయం రూ. 599 కోట్లుగా ఉంది.
వీనస్ పైప్స్: సెప్టెంబర్ క్వార్టర్‌లో వీనస్ పైప్స్ రూ. 20.3 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. రూ. 191.3 కోట్ల ఆదాయంపై ఈ లాభాన్ని ఆర్జించింది.
కర్ణాటక బ్యాంక్: ప్రాధాన్యత ప్రాతిపదికన రూ. 800 కోట్ల కేటాయింపునకు కర్ణాటక బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.
నోవార్టిస్: నోవార్టిస్, దాని ఉత్పత్తుల్లో ఒకటైన 'Simulect 20 mg' షార్టేజ్‌ను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. సాధ్యమైనంత త్వరగా సరఫరా సమస్యను తగ్గించడానికి ఉత్తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.