అన్వేషించండి

Stocks To Watch 15 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Infosys, SeQuent, Bharat Forge

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 15 September 2023: బెంచ్‌మార్క్ నిఫ్టీ గురువారం కొత్త గరిష్టాలను చేరింది, దేశీయ ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో సెన్సెక్స్ వరుసగా పదో రోజు ర్యాలీ చేసింది.

లాభాల్లో అమెరికన్‌ స్టాక్స్
అంచనాల కంటే వేడిగా ఉన్న US ఆర్థిక డేటా... వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపు భయాలను, ఆర్థిక మాంద్యం ఆందోళనలను తగ్గించింది. దీంతో S&P 500, నాస్‌డాక్‌, డో జోన్స్‌ గురువారం లాభాల్లో ముగిశాయి.

ఆసియా షేర్ల ర్యాలీ
వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ సాఫ్ట్ ల్యాండింగ్‌ చేస్తుందన్న ఊహాగానాలతో, ఆసియాలోని స్టాక్స్‌ US బెంచ్‌మార్క్‌లను అనుసరించాయి.

గిఫ్ట్‌ నిఫ్టీ
ఇవాళ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 16.5 పాయింట్లు లేదా 0.08 శాతం గ్రీన్‌ కలర్‌లో 20,234 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

ఇన్ఫోసిస్‌: అక్టోబర్ 12న రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటనతో పాటు మధ్యంతర డివిడెండ్‌ను కూడా పరిశీలిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది.

యునైటెడ్ స్పిరిట్స్: రాయల్టీ ఆదాయంపై GST రేటు వర్తింపజేయడంపై జారీ చేసిన ఆర్డర్‌ను సవాలు చేస్తూ జాయింట్ కమీషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ (అప్పీల్స్-1) వద్ద ఈ కంపెనీ కేస్‌ ఫైల్‌ చేసింది.

సీక్వెంట్ సైంటిఫిక్: థానేలో API ఫెసిలిటీని విక్రయించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.

గుఫిక్ బయోసైన్సెస్: ఏప్రిల్ 19, 2021 నుంచి అమలులోకి వచ్చేలా "ఒమాడాసైక్లిన్ టోసైలేట్‌" ఫ్రీజ్ డ్రైడ్ పేరెంటరల్ కంపోజిషన్, దాని తయారీ విధానంపై ఈ కంపెనీకి 20 సంవత్సరాల కాలానికి పేటెంట్ వచ్చింది.

ఆల్కెమ్ ల్యాబ్స్: తన కార్యాలయాలు, అనుబంధ సంస్థల్లో ఆదాయపు పన్ను విభాగం సోదాలు నిర్వహించిందని ఆల్కెమ్ ల్యాబ్స్ తెలిపింది. ఐటీ శాఖ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, వారు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తున్నామని ప్రకటించింది.

NTPC: NTPC లిమిటెడ్, 'UP రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్‌'మధ్య అనుబంధ జాయింట్ వెంచర్ ఒప్పందం కుదిరింది.

స్ట్రైడస్‌ ఫార్మా: తన స్టెప్‌డౌన్ అనుబంధ సంస్థ అయిన స్ట్రైడస్‌ ఫార్మా గ్లోబల్, డోలుటెగ్రావిర్ 50mg టాబ్లెట్‌లకు USFDA నుంచి తాత్కాలిక ఆమోదం పొందిందని స్ట్రైడస్‌ ఫార్మా సైన్స్ ప్రకటించింది.

భారత్ ఫోర్జ్: తన గ్లోబల్ కస్టమర్ల కోసం భారతదేశంలో విస్తృత శ్రేణి సాయుధ వాహనాలను ఉత్పత్తి చేయడానికి, భారత్ ఫోర్జ్-కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్‌తో కలిసి 'అభివృద్ధి & తయారీ' భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తున్నట్లు పారామౌంట్‌ ప్రకటించింది.

పటేల్ ఇంజనీరింగ్: నిరా డియోఘర్ రైట్ బ్యాంక్ మెయిన్ కెనాల్ కోసం పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ నిర్మాణానికి సంబంధించిన పనుల కోసం రూ.249.96 కోట్ల కాంట్రాక్టు పటేల్ ఇంజినీరింగ్‌కు దక్కింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్ అయిన అదానీ విండ్‌కు చెందిన 5.2 MW విండ్ టర్బైన్, MNRE మోడల్స్ జాబితాలో చేరింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ₹10 లక్షల రివార్డ్ రెడీగా ఉంది, ఈ చిన్న పని చేస్తే డబ్బంతా మీదే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Embed widget