News
News
వీడియోలు ఆటలు
X

Stocks Watch Today, 04 May 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో HDFC, Adani Enterprises

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌/ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stock Market Today, 04 May 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 72 పాయింట్లు లేదా 0.40 శాతం రెడ్‌ కలర్‌లో 18,089 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌/ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

US FED తన వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. భవిష్యత్‌ వడ్డీ రేట్ల పెంపులో విరామం ప్రకటిస్తామన్న సిగ్నల్‌ ఇచ్చింది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: HDFC, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డాబర్, టాటా పవర్, TVS, హీరో. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.

టైటన్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 734 కోట్ల స్వంతంత్ర నికర లాభాన్ని నమోదు చేసింది, గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 49% వృద్ధి. కార్యకలాపాల ఆదాయం 33% పెరిగి రూ. 9,704 కోట్లకు చేరుకుంది.

సూల వైన్‌యార్డ్స్‌: నాలుగో త్రైమాసికంలో రూ. 14.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది ఇదే కాలంలోని లాభం కంటే ఇది 5% ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7% పెరిగి రూ. 120 కోట్లకు చేరుకుంది.

గోద్రెజ్ ప్రాపర్టీస్: Q4లో రూ. 412 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో కార్యకలాపాల ఆదాయం 23% పెరిగి రూ. 1,646 కోట్లకు చేరుకుంది.

హావెల్స్ ఇండియా: జనవరి-మార్చి కాలానికి హావెల్స్ ఇండియా నికర లాభం స్వల్పంగా 2% పెరిగి రూ. 362 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో కార్యకలాపాల ఆదాయం 10% పెరిగి రూ. 4,850 కోట్లకు చేరుకుంది.

టాటా కెమికల్స్‌: మార్చి త్రైమాసికంలో టాటా కెమికల్స్ ఏకీకృత నికర లాభం 53% పెరిగి రూ. 711 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 27% పెరిగి రూ. 4,407 కోట్లకు చేరుకుంది.

కోల్టే-పాటిల్ డెవలపర్స్: కోల్టే-పాటిల్ డెవలపర్స్‌లోని తన వాటాను PGIM మ్యూచువల్ ఫండ్ విక్రయించగా, సొసైటీ జనరల్ బల్క్ డీల్స్ ద్వారా కొన్ని షేర్లను కొనుగోలు చేసింది.

ABB ఇండియా: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 245 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, కార్యకలాపాల ద్వారా రూ. 2,411 కోట్ల ఆదాయం వచ్చింది.

GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: 737 కోట్ల విలువైన రోడ్డు రవాణా టెండర్‌కు జీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.

చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 855 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, అదే సమయంలో నికర వడ్డీ ఆదాయం రూ. 2,006 కోట్లుగా ఉంది.

పెట్రోనెట్ LNG: నాలుగో త్రైమాసికంలో రూ. 614 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 13,873 కోట్ల ఆదాయం వచ్చింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 04 May 2023 08:09 AM (IST) Tags: Shares stocks in news Stock Market Buzzing stocks Q4 Results

సంబంధిత కథనాలు

Latest Gold-Silver Price Today 07 June 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

Latest Gold-Silver Price Today 07 June 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

FIIs: ఇండియన్‌ మార్కెట్‌పై నాన్‌-స్టాప్‌గా డాలర్ల వర్షం, FIIల షాపింగ్‌ లిస్ట్‌ ఇదిగో

FIIs: ఇండియన్‌ మార్కెట్‌పై నాన్‌-స్టాప్‌గా డాలర్ల వర్షం, FIIల షాపింగ్‌ లిస్ట్‌ ఇదిగో

Petrol-Diesel Price 07 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Petrol-Diesel Price 07 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Tata Technologies IPO: గ్రే మార్కెట్‌లో షేర్లు దొరకట్లా, ధర హై రేంజ్‌లో ఉంది!

Tata Technologies IPO: గ్రే మార్కెట్‌లో షేర్లు దొరకట్లా, ధర హై రేంజ్‌లో ఉంది!

Stocks Watch Today, 07 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group Stocks

Stocks Watch Today, 07 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group Stocks

టాప్ స్టోరీస్

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్