News
News
వీడియోలు ఆటలు
X

Stocks to watch 27 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Tata Steel, M&M

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stocks to watch today, 27 March 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 111 పాయింట్లు లేదా 0.66 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,030 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

లుపిన్: పితంపూర్ తయారీ కేంద్రంలో 'UK మెడిసిన్స్ అండ్‌ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ' నిర్వహించిన తనిఖీ విజయవంతంగా పూర్తయినట్లు కంపెనీ ప్రకటించింది. US FDA కూడా పోస్ట్-మార్కెటింగ్ అడ్వర్స్ డ్రగ్ ఎక్స్‌పీరియన్స్ (PADE) తనిఖీని పూర్తి చేసింది. ఎలాంటి పరిశీలనలు జారీ చేయలేదు.

వన్‌97 కమ్యూనికేషన్స్ (Paytm): పేమెంట్‌ అగ్రిగేటర్ (PA) లైసెన్స్ కోసం దరఖాస్తును మళ్లీ సమర్పించడానికి Paytm పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు (PPSL) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి అనుమతి వచ్చింది.

జైడస్ లైఫ్ సైన్సెస్: అహ్మదాబాద్‌లోని ఫార్మేజ్‌లో ఉన్న జైడస్ లైఫ్‌సైన్సెస్ తయారీ కేంద్రంలో US FDA తనిఖీ పూర్తి చేసింది. ప్రి-అప్రూవల్ ఇన్‌స్పెక్షన్ (PAI), GMP ఆడిట్, మూడు పరిశీలనలను జారీ చేసింది. డేటా సమగ్రతకు సంబంధించి ఎలాంటి పరిశీలనలు జారీ చేయలేదు.

షాపర్స్ స్టాప్: GSBBL ప్రిఫరెన్స్ షేర్ల సబ్‌స్క్రిప్షన్ ద్వారా, తన పూర్తి అనుబంధ సంస్థ అయిన గ్లోబల్ SS బ్యూటీ బ్రాండ్స్‌లో (GSBBL) రూ. 25 కోట్ల వరకు అదనపు పెట్టుబడిని ఒకటి లేదా ఎక్కువ విడతల్లో పెట్టేందుకు కంపెనీ బోర్డ్‌ ఆమోదించింది. ఇంతకుముందు, కూడా GSBBL ప్రాధాన్యత షేర్ క్యాపిటల్‌లో రూ. 20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది.

కజారియా సిరామిక్స్: నేపాల్‌లో ఏర్పాటు చేయనున్న కజారియా రమేష్ టైల్స్‌లో సవరించిన ప్రాజెక్ట్ వ్యయం రూ. 90.74 కోట్లు (రూ. 181.49 కోట్లలో 50%), రూ.21.23 కోట్ల వరకు (రూ. 42.45 కోట్లలో 50%) రూపంలో పెట్టుబడులు పెట్టడానికి కజారియా సిరామిక్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. జాయింట్‌ వెంచర్‌గా నేపాల్‌లో ఫ్లాంటును ఏర్పాటు చేస్తారు.

టాటా స్టీల్: టాటా స్టీల్ యుటిలిటీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌కు చెందిన ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ గల 4.65 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుపై రూ. 205 ప్రీమియంతో టాటా స్టీల్ కొనుగోలు చేసింది. రైట్స్‌ ప్రాతిపదికన రూ. 10 కోట్ల మొత్తానికి ఈ లావాదేవీ జరిగింది.

శ్రీరామ్ ఫైనాన్స్: ఈ కంపెనీ 9% కూపన్ రేటుతో NCDల జారీ ద్వారా రూ. 341 కోట్లు సమీకరించింది.

మహీంద్ర & మహీంద్ర: ఏరోస్పేస్‌లో తన వాటాను 91.59% నుంచి 100%కి M&M పెంచుకుంటుంది.

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా: Tll ‍‌(ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా) ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ (Premji lnvest), లోటస్ సర్జికల్స్‌లో వరుసగా 67%, 33% వాటాలను దక్కించుకోవడానికి ఒప్పందంలో ఉన్నాయి.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఏప్రిల్ 1, 2023 నుంచి మరో మూడేళ్ల కాలానికి బ్యాంక్ చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా యోగేష్ దీక్షిత్‌ను బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు నియమించింది.

యాక్సిస్ బ్యాంక్: S&P గ్లోబల్ రేటింగ్స్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను 'BBB-/స్టేబుల్/A-3'గా కొనసాగించింది.

కరూర్ వైశ్యా బ్యాంక్: జీవిత బీమా విభాగం పార్ట్‌నర్‌గా SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కరూర్ వైశ్యా బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.

జె.కుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి రూ. 249.2 కోట్ల ప్రాజెక్టుకు అంగీకార లేఖను (LOA) AICPL (JV 55:45) అందుకుంది.

భారతి ఎయిర్‌టెల్: దేశంలోని 500 నగరాల్లోకి 5G ప్లస్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 27 Mar 2023 08:35 AM (IST) Tags: Stock market Paytm Axis Bank M & M Share Market Tata Steel Bharti Airtel

సంబంధిత కథనాలు

CIBIL Score: సిబిల్‌ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి

CIBIL Score: సిబిల్‌ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి

Coin Deposit: బ్యాంక్‌ అకౌంట్‌లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?

Coin Deposit: బ్యాంక్‌ అకౌంట్‌లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?

Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు

Indian Market: మళ్లీ ఐదో స్థానంలోకి ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌, వెనక్కు తగ్గిన ఫ్రాన్స్‌

Indian Market: మళ్లీ ఐదో స్థానంలోకి ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌, వెనక్కు తగ్గిన ఫ్రాన్స్‌

Stock Market News: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు - 18,600 సమీపంలో ముగిసిన నిఫ్టీ!

Stock Market News: ఫుల్‌ జోష్‌లో స్టాక్‌ మార్కెట్లు - 18,600 సమీపంలో ముగిసిన నిఫ్టీ!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?