Stocks to watch 26 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - లాంగ్‌టర్మ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న Tata Motors
సంవత్సరాంతపు సెలవుల వల్ల విదేశీ పెట్టుబడిదారులు భాగస్వామ్యం పెద్దగా ఉండదు కాబట్టి ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతాయని భావిస్తున్నారు.
Stocks to watch today, 26 December 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 26 పాయింట్లు లేదా 0.15 శాతం గ్రీన్ కలర్‌లో 17,890 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. అయితే, సంవత్సరాంతపు సెలవుల వల్ల విదేశీ పెట్టుబడిదారులు భాగస్వామ్యం పెద్దగా ఉండదు కాబట్టి ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతాయని భావిస్తున్నారు. దీంతోపాటు, చైనాలో పెరుగుతున్న COVID కేసులు పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి, పెద్ద ఇన్వెస్టర్లు సెల్లింగ్ మోడ్‌లో ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
NDTV: కంపెనీ వ్యవస్థాపకులు రాధికా రాయ్ & ప్రణయ్ రాయ్, తమ వాటాలో 27.26% అదానీ గ్రూప్ యాజమాన్యంలోని RRPR హోల్డింగ్‌కు బదిలీ చేస్తారు. ఫలితంగా, ఈ న్యూస్ బ్రాడ్‌కాస్టర్‌లో అదానీ గ్రూప్ వాటా 64.71 శాతానికి పెరుగుతుంది.
టాటా మోటార్స్: దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్ప్ నుంచి ఒక కాంట్రాక్టును టాటా మోటార్స్ సబ్సిడరీ TML CV మొబిలిటీ సొల్యూషన్స్ దక్కించుకుంది. దిల్లీలో 12 సంవత్సరాల పాటు 1,500 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి, నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
సువెన్ ఫార్మాస్యూటికల్స్: ఈ కంపెనీలో పెద్ద వాటా కొనుగోలు చేయడానికి ప్రమోటర్‌తో బైండింగ్ ఒప్పందం మీద అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంతకం చేసింది. ఈ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ డ్రగ్ మేకర్‌లో అదనంగా 26% వాటాను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ చేస్తుంది.
క్వెస్ కార్ప్: తన అనుబంధ సంస్థ ఆల్‌సెక్ టెక్నాలజీస్‌ను (Allsec Technologies) విలీనం చేయాలన్న ప్రణాళికలను ఈ కంపెనీ ఉపసంహరించుకుంది. అయితే ఈ నిర్ణయానికి కారణమేంటో వివరించలేదు.
ఆల్కెమ్ లేబొరేటరీస్: తనకు 8 వాటా ఉన్న ఎంజీన్ బయోసైన్సెస్‌ను (Enzene Biosciences) రెండు ఫండ్స్‌కు రూ. 160 కోట్లకు విక్రయించనుంది. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని భారతదేశం & యుఎస్‌లో ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు వినియోగిస్తారు.
విప్రో: అమెరికాకు చెందిన కిబ్సీ ఇంక్‌లో (Kibsi Inc) మైనారిటీ వాటాను ఈ కంపెనీ 1.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడి ద్వారా, కంప్యూటర్ విజన్ అప్లికేషన్స్‌లో రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పడుతుంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ PN వాసుదేవన్ పదవీ కాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు ఈ కంపెనీ పొడిగించింది.
SJVN: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 100 MW పవన విద్యుత్ ప్రాజెక్టును ఈ కంపెనీ దక్కించుకుంది.
సీమెన్స్: గుజరాత్‌లో 9,000 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ప్రాజెక్ట్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్‌ను సీమెన్స్ అందుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.