Stocks to watch 23 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో Tata Steel, Hero, Aster DM
మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 23 September 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 74 పాయింట్లు లేదా 0.42 శాతం రెడ్ కలర్‌లో 17,566 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా స్టీల్: 7 అనుబంధ సంస్థలు - టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, టాటా మెటాలిక్స్, ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టిఆర్‌ఎఫ్, ఇండియన్ స్టీల్ & వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్&టీ మైనింగ్‌ను మాతృ సంస్థ టాటా స్టీల్‌లో విలీనం చేయడానికి కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది.
హీరో మోటోకార్ప్: ఈ టూ-వీలర్ ఆటో మేజర్, తన మోటార్ సైకిళ్లు & స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధరలను తక్షణమే అమల్లోకి వచ్చేలా, ఒక్కో యూనిట్ మీద రూ.1,000 వరకు పెంచింది. మోడల్, మార్కెట్‌ను బట్టి ధర పెరుగుదలలో చిన్నపాటి వ్యత్యాసాలు ఉంటాయి.
ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్: ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ లిమిటెడ్ స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ అయిన మెడ్‌కేర్ హాస్పిటల్ LLC (Medcare Hospital LLC) దుబాయ్‌కి చెందిన లీడింగ్ కంపెనీ స్కిన్ III లిమిటెడ్‌లో (Skin III Limited) 60% వాటా కొనుగోలు చేసింది. IV డ్రిప్స్ (విటమిన్ & డిటాక్స్), సౌందర్య పద్ధతులను (హైడ్రాఫేషియల్, లేజర్ హెయిర్ రిమూవల్ వంటివి) అందిస్తున్న అగ్రగామి సంస్థ స్కిన్ III లిమిటెడ్.
హెచ్‌సీఎల్ ఇన్ఫో సిస్టమ్స్: రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (Ind-Ra), ఈ కంపెనీ దీర్ఘకాలిక ఇష్యూయర్ రేటింగ్‌ను 'BBB-/stable'గా కంటిన్యూ చేసింది.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (Indigo): తన ఫ్లైట్ నెట్‌వర్క్‌కు 100వ డెస్టినేషన్‌ను ఇండిగో యాడ్ చేసింది. ముంబై, యూఏఈలోని రస్ అల్ ఖైమా మధ్య నేరుగా విమానాలను ప్రారంభించింది.
మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్: తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు, ఔట్ సోర్సింగ్ ఏజెంట్ల ద్వారా లోన్ల రికవరీ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఈ NBFC కంపెనీని RBI ఆదేశించింది. సొంత ఉద్యోగుల ద్వారా రికవరీ కార్యకలాపాలను కొనసాగించవచ్చు.
లుపిన్: డిక్లోఫెనాక్ సోడియం టాపికల్ సొల్యూషన్ USPని అమెరికా మార్కెట్‌లో విడుదల చేసేందుకు USFDA నుంచి లుపిన్ ఆమోదం పొందింది.
అరబిందో ఫార్మా: కంపెనీ నార్త్ కరోలినా యూనిట్లు USFDA నుంచి ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్స్ (EIR) పొందాయి. ముందస్తు ఆమోదం, GMP తనిఖీ తర్వాత EIRను USFDA ఇచ్చింది. అందులోని సూచనలను అరబిందో ఫార్మా స్వచ్ఛందంగా పాటించవచ్చని USFDA తెలిపింది.
భారతీ ఎయిర్‌టెల్: వాట్సాప్‌తో కలిసి, 'ఎయిర్‌టెల్ ఐక్యూ హ్యాకథాన్'ను (Airtel IQ Hackathon) ఈ టెల్కో ప్రారంభించింది. కొత్త తరం వ్యాపార పరిష్కాలను అభివృద్ధి చేయడానికి వాట్సాప్‌లో స్టార్టప్‌లను ఆహ్వానించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.