US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
2024 US Presidential Election | అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అమెరికన్లు భారీ ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
US Election 2024 | వాషింగ్టన్: అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలలో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ దాదాపు 82 మిలియన్ అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని ఎలక్షన్ ల్యాబ్ ఈ విషయాన్ని వెల్లడించింది. 38 మిలియన్ల మంది మెయిల్ ద్వారా ముందుగానే ఓటు హక్కు వినియోగించుకోగా, దాదాపు 45 మిలియన్ల మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు కావడంతో డొనాల్డ్ ట్రంప్ నకు ప్లస్ కానుంది. అయితే ట్రంప్ నిర్ణయాలు అమెరికాను వెనక్కి తీసుకెళ్లాయని, ఆయన ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేసి డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కు కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.
అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే 7 స్వింగ్ స్టేట్స్
పెన్సిల్వేనియా (19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు)
జార్జియా (16)
నార్త్ కరోలినా (16)
మిచిగాన్ (15)
అరిజోనా (11)
విస్కాన్సిన్ (10)
నెవాడా (6)
VIDEO | US Election 2024: Voting underway at a polling station in Washington DC.#USElections2024WithPTI #USElections2024
— Press Trust of India (@PTI_News) November 5, 2024
(Full video available on PTI videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/xegiU7E4hk
టెక్సాస్, విస్కాన్సిన్‌లో ఓటింగ్ ప్రారంభం
అమెరికా ఈస్ట్ కోస్ట్‌లో టెక్సాస్, అరిజోనాలతో పాటు కీలకమైన స్వింగ్ స్టేట్ విస్కాన్సిన్‌తో సహా మరో పది రాష్ట్రాల్లో ఓటింగ్ మొదలైంది. మిస్సిస్సిప్పి, నార్త్ డకోటా, అయోవా, కాన్సాస్ (కౌంటీ వారీగా సౌలభ్యంతో), మిన్నెసోటా, ఓక్లహోమా, సౌత్ డకోటా, టెక్సాస్, విస్కాన్సిన్ ఉన్నాయి. ఇవి 10 ఎలక్టోరల్ ఓట్లను కలిగి ఉన్నాయి. ఇవి కూడా కీలకంగా మారనున్నాయి.
ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు: పోల్ అధికారులు
అమెరికా తదుపరి అధినేతను అమెరికా ఓటర్లు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకుంటున్నారు. అయితే ప్రజలు అమెరికా సమగ్రతను కాపాడతారని, కుట్రలు చేసి వారిని తప్పుదోవ పట్టించవద్దు అని ఎన్నికల అధికారులు నేతల్ని కోరారు. జార్జియాలో ఓటు వేయడం, అదే విధంగా మోసం చేయడం కష్టమైన పని అని జార్జియా స్టేట్ సెక్రటరీ బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ సోమవారం అన్నారు. ప్రజలు పారదర్శకంగా, నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పారు. తొలి ఫలితం వెలువడగా ట్రంప్, హారిస్ కు సమానంగా సీట్లు రావడంతో ఉత్కంఠ పెరిగింది. న్యూహ్యాంప్‌షైర్ లోని డిక్స్‌విల్లే నాచ్‌లో ఆరు ఓట్లు ఉండగా, హారిస్ కు 3, ట్రంప్ నకు 3 ఓట్లు వచ్చాయి.
Also Read: US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
భారత్ లో సాయంత్రం 5 కు ఇక్కడ పోలింగ్ ప్రారంభం
ఒహియో
ఉత్తర కరోలినా
వెస్ట్ వర్జీనియా
వెర్మోంట్
సాయంత్రం 5.30 గంటలకు అలబామా, డెలావేర్, వాషింగ్టన్ DC, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, కాన్సాస్, మేరీల్యాండ్, మసాచుసెట్స్, మిచిగాన్, మిస్సోరి, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్, దక్షిణ కరోలిన, టేనస్సీ రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. అమెరికాలో మొత్తం 538 సీట్లు కాగా, సాధారణ మెజార్టీ సాధించాలన్నా 270 సీట్లు రావాలి.
Also Read: US Presidential Election 2024: యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?