అన్వేషించండి

Stocks to watch 12 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Reliance, ONGC మీద ఓ కన్నేయండి

మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

Stocks to watch today, 12 September 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 22 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్‌‌లో 17,864 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL): పాలిస్టర్ చిప్స్ నూలు తయారీ కంపెనీ శుభలక్ష్మి పాలిస్టర్స్ లిమిటెడ్‌ను రూ.1,592 కోట్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేసింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), సంబంధిత రుణదాతల ఆమోదానికి లోబడి ఈ ఒప్పందం ఉంటుంది.

ఓఎన్‌జీసీ : DSF-III బిడ్ రౌండ్ కింద, ఆఫ్‌షోర్‌లో డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్ (DSF) కోసం ఆరు ఒప్పందాల మీద సంతకాలు చేసింది. వీటిలో మూడు అరేబియా సముద్రం, మరో మూడు బంగాళాఖాతంలోని ఫీల్డ్స్‌కు సంబంధించినవి. జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లోని ప్రత్యేక CBM బిడ్ రౌండ్-2021 బ్లాక్స్‌ కింద, ఫీల్స్‌ కోసం కూడా రెండు ఒప్పందాలు చేసుకుంది.

టాటా స్టీల్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, అన్‌ సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ప్రతిపాదనను పరిశీలించేందుకు, ఈ నెల 14న డైరెక్టర్ల బోర్డు సమావేశం జరగనుంది. 

అదానీ ట్రాన్స్‌మిషన్: అదానీ ట్రాన్స్‌మిషన్‌ నుంచి రూ.13,400 కోట్ల కోసం, 'ముంబై సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్'లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ క్లెయిమ్‌ను అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాఖలు చేసింది.

అశోక్ లేలాండ్: హిందూజా గ్రూప్‌లోని ఈ ఫ్లాగ్‌ షిప్ కంపెనీ, తన వాణిజ్య వాహనాల పవర్‌ట్రెయిన్స్‌ కోసం యూకేకి చెందిన లిబర్టైన్ హోల్డింగ్స్‌తో చేతులు కలిపింది. తన కమర్షియల్ వెహికల్ పవర్‌ట్రెయిన్స్‌ కోసం లిబర్టైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడంపై ఒక అంచనాకు రావడానికి ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

స్పైస్‌జెట్: చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఆశిష్ కుమార్‌ను ఈ కంపెనీ నియమించింది. ఈ నెల 9 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. ఆగస్టు 31న దిగిపోయిన సంజీవ్ తనేజా స్థానంలో కుమార్ నియమితులయ్యారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా: ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ రుణదాత, FY22 కోసం దాని అసెట్‌ క్లాసిఫికేషన్‌లో డైవర్జెన్స్‌ను రిపోర్ట్ చేసింది. ఫలితంగా, నికర లాభం రూ.2,221 కోట్లకు తగ్గింది. ఇంతకుముందు, నికర లాభాన్ని రూ.3,404.70 కోట్లుగా నివేదించింది.

అనుపమ్ రసాయన్: ఈ నెల 10న, సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్లాంట్‌లోని యూనిట్-6లో అగ్నిప్రమాదం జరిగిందని  స్పెషాలిటీ కెమికల్ మేకర్ వెల్లడించింది. ఆ అగ్ని ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు, 20 మంది గాయపడ్డారు.

హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్: ఈ నిర్మాణ, ఇంజినీరింగ్ సంస్థ అనుబంధ కంపెనీ హెచ్‌జీ అటెలి నార్నాల్ హైవే, హర్యానాలో తన రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ను పొందింది. 

మహీంద్ర లైఫ్‌స్పేస్ డెవలపర్స్‌: ఈ రియల్టీ సంస్థ, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 - 4,000 కోట్ల అమ్మకాల లక్ష్యంతో హౌసింగ్ ప్రాజెక్టులను నిర్మించడానికి కొన్ని ల్యాండ్ పార్సెల్స్‌ కొనుగోలు చేయాలని చూస్తోంది. భూములను పూర్తిగా కొనడం లేదా భూ యజమానులతో జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్స్ (JDA) ద్వారా ల్యాండ్‌ పార్సిల్స్‌ పొందుతుంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్‌ రూ.75 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసింది. NCDల రిడీమ్ తేదీ ఏప్రిల్ 26, 2028. కూపన్ రేటు 11.95 శాతం.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Best Budget CNG Cars: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Embed widget