Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Telangana: సినిమాలో మార్చినట్లు రియల్ గా సీఎంను మార్చాలని పుష్పకు ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Fans are giving suggestions to Pushpa: పుష్ప రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ను పోలీసులు సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు చేయడం ఆయన అభిమానులకు నచ్చడం లేదు. అల్లు అర్జున్ ను అరెస్టు చేసినప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. రకకరకాల చర్చలు పెడుతున్నారు. ఆ చర్చల సారాంశం ఈ అరెస్టు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనే. ఆ కోణంలోనే అనేక ట్వీట్లు పెడుతున్నారు.
సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సీఎంను మార్చే సమయం వచ్చింది bhAAi @alluarjun
— SunrAAiser🔥🔥 (@teiangana) December 13, 2024
జైల్లోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ సీఎం అయ్యారు.
— Milagro Movies (@MilagroMovies) December 13, 2024
Gurthupettuko @revanth_anumula
— NikhiLᵐˢᵈⁱᵃⁿ🦁 (@BunnyNikhil214) December 13, 2024
Gattiga Kindha padthav 👍🏻#WeStandWithAlluArjun pic.twitter.com/ieJ1g2Nuhx
ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ లో మాట్లాడిన అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. ఓ ఇంటర్యూలో కేటీఆర్ ఈ విషయాన్ని గుర్తు చేసి రేవంత్ రెడ్డి అన్ పాపులర్ సీఎం అన్నట్లుగా విమర్శలు చేశారు.ఇవన్నీ గుర్తుపెట్టుకునే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను అరెస్టు చేయించారన్న ఆరోపణలు చేస్తున్నారు.
last 6months nundi prathi Telugu vadu peelche gaali lo kuda bhAAi unnadu
— Lohith Reddy🦋🍷 (@Love_Cinemaa) December 13, 2024
bhAAi is brand..He is eternal @alluarjun
pic.twitter.com/eAiATVbEci
Reel life lo CM ni decide chesi marchesav
— NithishBunny🪓 (@nithishbunny48) December 13, 2024
Real life lo CM ni marchese time ochindi bhAAi💥💥#WeStandWithAlluArjun pic.twitter.com/EJODzFOcxk
కొంత మంది మరింత ముందుకు వెళ్లి పుష్ప సినిమాలో సీఎంను మార్చేసినట్లుగా రేవంత్ ను మార్చాలని సలహాలిస్తున్నారు. పుష్ప సినిమాలో ఓ సీఎం ఫోటో తీసుకునే విషయంలో ఇబ్బంది పెట్టడంతో ఆ సీఎంను పుష్ప మార్చేస్తారు. అలాగే నిజ జీవితంలో కూడా చేయాలంటున్నారు.
My dear bhAAi fans, gundela meeda cheyya veskoni alochinchandi, meeru ippudu thengalsindi #Telangana government ni#AlluArjun #WeStandwithAlluArjunpic.twitter.com/9u7zwx0Wz9
— Rค๓ (@RamsMultiverse) December 13, 2024
పుష్ప ఫ్యాన్స్ తెలుగులోనే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి వయోలెంట్ ట్వీట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ అదని.. ఫ్యాన్స్ సీరియస్ గా కాకుండా..కాస్త సెటైరిక్ గా ఈ ట్వీట్లు చేస్తున్నారని కొంత మంది భావిస్తున్నారు.