By: ABP Desam | Updated at : 11 Jan 2023 08:12 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ టుడే - 11 జనవరి 2023
Stocks to watch today, 11 January 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 25 పాయింట్లు లేదా 0.14 శాతం గ్రీన్ కలర్‌లో 18,011 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా మోటార్స్: తన అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEML) ద్వారా, సనంద్‌లోని ఫోర్డ్ ఇండియా తయారీ ప్లాంట్‌ను కొనుగోలును టాటా మోటార్స్ పూర్తి చేసింది. గుజరాత్‌లోని ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (FIPL) సనంద్ ప్లాంట్‌ను రూ. 725.7 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు గత ఏడాది ఆగస్టులో TPEML ప్రకటించింది, ఇప్పటికి డీల్ కంప్లీట్ అయింది.
అదానీ విల్మార్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు గరిష్ట ఏకం అంకెలో పెరుగుతాయని ఆదానీ విల్మార్ అంచనా వేస్తోంది. పండుగ సీజన్‌లో బలమైన డిమాండ్ & ఔట్ ఆఫ్ హోమ్ వినియోగంతో సేల్స్ పెరుగుతాయని నమ్మకంగా ఉంది. స్వతంత్ర అమ్మకాలు గరిష్ట రెండంకెల సంఖ్యలో పెరుగుతాయని కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో, ఈ కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఆహార నూనెల ధరల అస్థిరత తక్కువగా ఉంది, సెగ్మెంటల్ వాల్యూమ్ వృద్ధి గరిష్ట ఏక అంకెలో ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: ఈ కంపెనీ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అసోంలో 5G నెట్‌వర్క్ సేవలను ప్రారంభించడానికి మరో రూ. 2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కంపెనీ పెట్టుబడులు రూ. 9,500 కోట్లుగా ఉన్నాయి.
అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్: ఇజ్రాయెల్‌కు చెందిన గాడోట్ గ్రూప్‌తో (Gadot Group) కన్సార్టియంలో ఉన్న ఈ కంపెనీ, ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌ను (Haifa Port) 1.15 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది, ఇజ్రాయెల్ ప్రధాన ఓడరేవుల్లో ఒకటి.
ఉత్తమ్ షుగర్ మిల్స్: ఉత్తరప్రదేశ్ బర్కత్‌పూర్‌లోని యూనిట్‌లో డిస్టిలరీ సామర్థ్యాన్ని రోజుకు 150 కిలో లీటర్ల నుంచి 250 కిలో లీటర్లకు పెంచడానికి ఉత్తమ్ షుగర్ మిల్స్ రూ. 56 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత సామర్థ్య విస్తరణను 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. వడ్డీ రాయితీ పథకం కింద రుణాలు, అంతర్గత సమీకరణల ద్వారా సామర్థ్య విస్తరణకు నిధులను ఈ కంపెనీ సమకూర్చుకుంటుంది.
PC జ్యువెలర్: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ దేశీయ విక్రయాలు గత ఏడాది డిసెంబర్ త్రైమాసికం కంటే 38% పెరిగి రూ. 829 కోట్లకు చేరుకున్నాయి. ఆ త్రైమాసికంలో బీహార్‌లో కొత్త ఫ్రాంచైజీ షోరూమ్‌ను ఈ ఆభరణాల కంపెనీ ప్రారంభించింది.
వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్: ఈ సివిల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ షేర్లు, ఒక్కో షేరుకు ప్రకటించిన ప్రత్యేక డివిడెండ్ రూ. 7.5కు సంబంధించి, ఇవాళ ఎక్స్ డేట్. కాబట్టి, ఇవాళ షేర్ ధర ఆ మేరకు సర్దుబాటు అవుతుంది.
జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్: ఈ కంపెనీ షేర్లు దాని రైట్స్ ఇష్యూకి సంబంధించి 1:1 నిష్పత్తిలో ఎక్స్-రైట్‌లో ఇవాళ ట్రేడ్ అవుతాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
Budget 2023: బడ్జెట్- 2023లో పన్ను మినహాయింపులు- 1992 నాటి పన్ను శ్లాబ్ ఫొటో వైరల్
Income Tax Slab: గుడ్‌న్యూస్! రూ.7 లక్షల వరకు 'పన్ను' లేదు - పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు!
New Tax Regime: రూ.9 లక్షల ఆదాయానికి రూ.45వేలు, రూ.15 లక్షలకు రూ.1.5 లక్షలే టాక్స్!
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం
Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం