(Source: ECI/ABP News/ABP Majha)
Stocks to watch 09 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - నేడు LIC Q3 రిజల్ట్స్
మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 09 February 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 4 పాయింట్లు లేదా 0.02 శాతం గ్రీన్ కలర్‌లో 17,494 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ విల్మార్: 2022 డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలానికి అదానీ విల్మార్ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 16% పెరిగి రూ. 246 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7% పెరిగి రూ. 15,438 కోట్లుగా నమోదైంది.
శ్రీ సిమెంట్: డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత పన్ను తర్వాతి లాభం (PAT) రూ. 277 కోట్లకు చేరింది, గత సంవత్సరం ఇదే కాలం కంటే 44% క్షీణించింది. ఈ కంపెనీ, ఒక్కో షేరుకు రూ. 45 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.
LIC: ఇన్సూరెన్స్ బెహెమోత్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తన మూడవ త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనుంది.
హనీవెల్ ఆటోమేషన్ ఇండియా: 2022 డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 18% పెరిగి రూ. 106 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 18% పెరిగి రూ. 1,017 కోట్లకు చేరుకుంది.
అదానీ పవర్: డిసెంబర్ త్రైమాసికానికి అదానీ పవర్ ఏకీకృత నికర లాభం రూ. 9 కోట్లుగా నమోదైంది, ఏడాది ప్రాతిపదికన 96% పడిపోయింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 45% పెరిగి రూ. 7,764 కోట్లకు చేరుకుంది.
భారతి ఎయిర్‌టెల్: దేశంలోని వివిధ సంస్థలకు క్లౌడ్ సొల్యూషన్స్ అందించడానికి Airtel & Vultr కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. Airtel తన ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లకు, ముఖ్యంగా డిజిటల్ స్పేస్‌లో ఉన్నవారికి Vultr విస్తృత క్లౌడ్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది.
ఎస్కార్ట్స్ కుబోటా: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో.. వ్యవసాయ, నిర్మాణ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్స్ కుబోటా ఏకీకృత నికర లాభం 6.7% క్షీణించి రూ. 181 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఏకీకృత ఆదాయం రూ. 2,291 కోట్లుగా ఉంది.
TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, UKకు చెందిన ఫీనిక్స్ గ్రూప్‌తో తన దీర్ఘకాల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫీనిక్స్ గ్రూప్ రీఅష్యూర్ వ్యాపారాన్ని డిజిటల్‌గా మార్చడానికి అతి భారీ ఆర్డర్ దక్కించుకుంది.
జొమాటో తన మూడో త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించనుంది. పెరిగిన ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లు, ఇంటిగ్రేటెడ్ బ్లింకిట్ వ్యాపారం ఇటీవల అందించిన కాంట్రిబ్యూషన్‌తో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం ఆదాయంలో రెండంకెల QoQ వృద్ధిని సాధించే అవకాశం ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.