News
News
X

Stocks to watch 06 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HDFC మీద మనసు పడ్డ LIC

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stocks to watch today, 06 December 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 76 పాయింట్లు లేదా 0.41 శాతం రెడ్‌ కలర్‌లో 18,733 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

HDFC: దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), బహిరంగ మార్కెట్ నుంచి HDFCకి చెందిన 1.2 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. తద్వారా HDFCలో తన వాటాను 5.003 శాతానికి పెంచుకుంది.

టాటా మోటార్స్: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే కఠిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మోడల్ రేంజ్‌ను చేయడానికి వచ్చే నెల నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని ఈ స్వదేశీ ఆటో మేజర్ చూస్తోంది. భారీగా పెరిగిన రామెటీరియల్‌ రేట్ల భారాన్ని కూడా ఈ ధరల పెంపుతో భర్తీ చేసుకుంటుంది.

వొడాఫోన్ ఐడియా: జనవరి నాటికి తమ బకాయిలను వొడాఫోన్ ఐడియా క్లియర్ చేయలేదేమోనని మొబైల్ టవర్ కంపెనీ అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ATC) అనుమానం వ్యక్తం చేసింది. ATC టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ. 1,600 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడానికి వొడాఫోన్ ఐడియా గత నెలలో ఆమోదించింది.

TVS మోటార్ కంపెనీ: ప్రమోటర్ సంస్థ అయిన శ్రీనివాసన్ ట్రస్ట్, 25,69,726 టీవీఎస్‌ మోటార్‌ షేర్లు లేదా 0.54 శాతం వాటాను సగటు ధర రూ. 1,020.03 చొప్పున రూ. 262 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా ఆఫ్‌లోడ్ చేసింది. 

IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్‌: ఈ ఏడాది నవంబర్‌లో అన్ని ప్రాజెక్టుల్లో టోల్ కలెక్షన్లు 39 శాతం ‍‌(సంవత్సర ప్రాతిపదికన) పెరిగినట్లు ఈ సివిల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, దీని అనుబంధ సంస్థ అయిన IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ నివేదించాయి. నవంబర్‌లో రూ. 365.95 కోట్ల టోల్ వసూలు చేసినట్లు వెల్లడించాయి.

నాట్కో ఫార్మా: పేటెంట్ ఉల్లంఘన కేసులో దిల్లీ హైకోర్టు నుంచి తమకు అనుకూలమైన తీర్పు వచ్చిందని ఈ ఔషధ సంస్థ వెల్లడించింది. FMC కార్పొరేషన్, FMC సింగపూర్, FMC ఇండియా దాఖలు చేసిన అప్పీల్‌ను దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెంచ్ కొట్టివేసింది.

JSW ఎనర్జీ: JSW ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన JSW ReNew Energy, తమిళనాడులోని టుటికోరిన్‌లో 27 MW పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. 450 MW పవన ప్రాజెక్టు మొదటి దశలో ఇదొక భాగం. ఇది ఈ కంపెనీకి మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ విండ్ పవర్ ప్రాజెక్ట్.

రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్: ఈ మల్టీ స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్ చైన్‌లో తన మొత్తం 14.45 శాతం వాటాను లేదా 1,46,66,112 షేర్లను బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అమ్మేసింది. ఒక్కో షేరు సగటు ధర రూ. 735 చొప్పున రూ. 1,078.48 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా పెట్టుబడిని ఉపసంహరించుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 06 Dec 2022 08:25 AM (IST) Tags: Share Market Stocks to watch stocks in news Stock Market Buzzing stocks

సంబంధిత కథనాలు

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

Auto Stocks to Buy: బడ్జెట్‌ తర్వాత స్పీడ్‌ ట్రాక్‌ ఎక్కిన 10 ఆటో స్టాక్స్ ఇవి, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?

Auto Stocks to Buy: బడ్జెట్‌ తర్వాత స్పీడ్‌ ట్రాక్‌ ఎక్కిన 10 ఆటో స్టాక్స్ ఇవి, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో అదానీ షేర్ల కిక్కు - సెన్సెక్స్‌ 377, నిఫ్టీ 150 అప్‌!

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో అదానీ షేర్ల కిక్కు - సెన్సెక్స్‌ 377, నిఫ్టీ 150 అప్‌!

Cryptocurrency Prices: మిశ్రమంగా క్రిప్టోలు - బిట్‌కాయిన్‌ ఏంటీ ఇలా పెరిగింది!

Cryptocurrency Prices: మిశ్రమంగా క్రిప్టోలు - బిట్‌కాయిన్‌ ఏంటీ ఇలా పెరిగింది!

Coin Vending Machines: దేశంలో తొలిసారిగా కాయిన్‌ మెషీన్స్‌, చిల్లర సమస్యలకు చెక్‌

Coin Vending Machines: దేశంలో తొలిసారిగా కాయిన్‌ మెషీన్స్‌, చిల్లర సమస్యలకు చెక్‌

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్