Stocks to watch 04 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - HDFC రైజ్, Hero డౌన్
మన మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 04 November 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 7.5 పాయింట్లు లేదా 0.04 శాతం రెడ్ కలర్‌లో 18,005 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: టైటన్ కంపెనీ, సిప్లా, బ్రిటానియా ఇండస్ట్రీస్, మ్యారికో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, గెయిల్ (ఇండియా), TVS మోటార్స్ కంపెనీ, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా, కమిన్స్ ఇండియా, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా, IDFC ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఎస్కార్ట్స్ కుబోటా
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
హీరో మోటోకార్ప్: 2022 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి, దేశంలోని అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏకీకృత నికర లాభం 9 శాతం క్షీణించి రూ.682 కోట్లకు చేరుకుంది. ఖర్చులు పెరగడం, అమ్మకాలు స్వల్పంగా క్షీణించడం వల్ల లాభం తగ్గింది. క్రితం ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో రూ.748 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
HDFC: మెర్జర్ ప్రాసెస్‌లో ఉన్న ఈ మార్టిగేజ్ మేజర్ నికర ఆదాయం సెప్టెంబరు త్రైమాసికంలో 18 శాతం వృద్ధితో రూ. 4,454 కోట్లకు చేరుకుంది. రిటైల్ లోన్లు ఎనిమిదేళ్ల గరిష్టానికి, 36 శాతానికి చేరాయి.
విప్రో: క్యాప్‌జెమిని మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అమిత్ చౌదరిని తన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ & ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్‌గా విప్రో నియమించింది. సంస్థాగత కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే బాధ్యతలు చౌదరి తీసుకున్నారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: సెప్టెంబర్ త్రైమాసికంలో, గౌతమ్ అదానీ గ్రూప్‌లోని ఈ ఫ్లాగ్‌షిప్ కంపెనీ నికర లాభం రెట్టింపు పైగా పెరిగింది. సమీకృత వనరుల నిర్వహణ, విమానాశ్రయ విభాగంలో బలమైన పనితీరు వల్ల రూ. 460.94 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 212.41 కోట్ల లాభం మిగుల్చుకుంది.
వొడాఫోన్ ఐడియా: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నష్టాన్ని రూ.7,595.5 కోట్లకు పెంచుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 7,132.3 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
SRF: నాలుగు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు, ప్రస్తుతం ఉన్న ఫెసిలిటీల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు రూ. 604 కోట్ల పెట్టుబడికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. తద్వారా, మరికొన్ని స్పెషాలిటీ కెమికల్స్‌ను కంపెనీ ఉత్పత్తి చేయనుంది.
ఇండియన్ హోటల్స్ కంపెనీ: టాటా గ్రూప్‌లోని హోటల్ విభాగం, కేరళలోని మున్నార్‌లో 55 గదుల సెలెక్షన్స్ (SeleQtions) హోటల్‌తో ఒప్పందంపై సంతకం చేసింది. ఇదొక బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్. CRB హోటల్స్ & రిసార్ట్స్‌తో ఇది ఒక నిర్వహణ ఒప్పందం.
అమర రాజా బ్యాటరీస్: సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత పన్ను తర్వాతి లాభం 39.42 శాతం పెరిగి రూ. 201.22 కోట్లకు చేరుకుంది. అధిక అమ్మకాల వల్ల ఆదాయం, లాభం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.144.32 కోట్ల ఏకీకృత లాభాన్ని కంపెనీ నమోదు చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.