By: ABP Desam | Updated at : 19 Jan 2023 02:54 PM (IST)
Edited By: Arunmali
బడ్జెట్ ముందు కొనాల్సిన బెస్ట్ స్టాక్స్ ఇవి
Budget Stocks to Buy: 2023 ఫిబ్రవరి 1వ తేదీన, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2023ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ మీద ఇప్పటికే స్టాక్ మార్కెట్‌లో చాలా అంచనాలున్నాయి. ఏయే రంగాలకు కేటాయింపులు పెరుగుతాయి, ఏ స్టాక్స్ భవిష్యత్ బాగుంటుంది, వేటికి బడ్జెట్‌లో వాత పెడతారు అన్న లెక్కలతో కొనుగోళ్లు, అమ్మకాలు చకచకా జరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో, బ్రోకింగ్ కంపెనీ ఎల్‌కేపీ సెక్యూరిటీస్ (LKP Securities) 6 స్టాక్స్‌ను ఎంపిక చేసింది. మంచి రాబడిని అందించే బలం, సామర్థ్యాన్ని వీటికి ఉందని సిఫార్సు చేస్తోంది. బడ్జెట్ ముందు కొనాల్సినవి అని LKP సెక్యూరిటీస్ చెబుతున్న స్టాక్స్... ఐటీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, టాటా పవర్, ఎన్‌టీపీసీ, సైమెన్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్. ఇవి స్వల్పకాలంలో మంచి లాభ అవకాశాలను అందిస్తాయని బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయపడింది.
యూనియన్ బడ్జెట్ 2023కి ముందు కొనుగోలు చేయదగిన 6 స్టాక్స్ వివరాలు ఇవి:
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (Power Finance Corporation) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 152
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ. 167 టార్గెట్ ధరతో బయ్ కాల్ ఇచ్చింది బ్రోకరేజ్ సంస్థ LKP సెక్యూరిటీస్. ఇది ప్రస్తుత మార్కెట్ ధర నుంచి మరో 10% పెరగవచ్చని చెబుతోంది.
టాటా పవర్ (Tata Power) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 207
టాటా పవర్ కౌంటర్‌కు రూ. 270 టార్గెట్ ధరతో బయ్ సిఫార్సు చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 30% అప్‌సైడ్ ర్యాలీ చేయగల అవకాశాన్ని ఇది సూచిస్తోంది..
ఐటీసీ (ITC) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 335
ఈ స్ర్కిప్‌కు బయ్ రేటింగ్ + రూ. 385 టార్గెట్ ధరను బ్రోకరేజ్ ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ ధరల నుంచి 15% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఇది సూచిస్తోంది..
ఎన్‌టీసీపీ (NTPC) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 169
ఈ నేమ్ మీద బయ్ రేటింగ్‌తో ఉన్న బ్రోకరేజ్ సంస్థ LKP సెక్యూరిటీస్, రూ. 200 టార్గెట్ ధరను ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి మరో 18% పెరుగుదలను ఇది సూచిస్తోంది..
సైమెన్స్ (Siemens) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 3073
సైమెన్స్‌కు బయ్ రేటింగ్‌తో పాటు రూ. 3,400 టార్గెట్ ప్రైస్‌ను బ్రోకింగ్ కంపెనీ కంటిన్యూ చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర మీద మరో 11% లాభాన్ని అందివచ్చన్నది దీని అర్ధం.
చంబల్ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ (Chambal Fertilisers & Chemicals) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 306
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని LKP సెక్యూరిటీస్ సిఫార్సు చేసింది. బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ రూ. 360. ప్రస్తుత మార్కెట్ ధరల నుంచి 18% ర్యాలీ ఉంటుందని దీని అర్ధం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్
Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్‌లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!
FII stake: మూడు నెలల్లోనే ఎఫ్ఐఐ పెట్టుబడులు రెట్టింపు, ఈ బ్యాంక్‌పై ఎందుకంత నమ్మకం?
Telangana Budget 2023: రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా జడ్జి కోర్టులు - 1,721 పోస్టుల మంజూరు!
Stock Market News: మార్కెట్లు డల్ - కేక పెట్టించిన అదానీ షేర్లు, సెన్సెక్స్ 335 డౌన్!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Minsiter Errabelli : బీఆర్ఎస్ నేత కన్నుమూత, పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి