By: ABP Desam | Updated at : 15 Jun 2023 04:34 PM (IST)
ప్రభుత్వ బ్యాంక్స్ Vs ప్రైవేట్ బ్యాంక్స్
Stock Picks: గత ఒక సంవత్సర కాలంలో, హెడ్‌లైన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు (BSE, NSE) పెద్దగా లాభాలు ఇవ్వకపోయినా, ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public sector banks) ఇన్వెస్టర్లను ఆదుకున్నాయి, వాళ్ల నష్టాలను చాలా వరకు భర్తీ చేశాయి. ఆదాయాలు, స్టాక్ పనితీరు పరంగా FY23లో బెస్ట్ స్టాక్స్ ఇవేనని కచ్చితంగా చెప్పుకోవచ్చు.
FY23లో, PSU బ్యాంకింగ్ సెక్టార్ బాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా చాలా బ్యాంకులు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతేకాదు, గత ఒక సంవత్సర కాలంలో నాలుగు స్టాక్స్ మల్టీబ్యాగర్‌లుగా మారాయి. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (PSU) బ్యాంక్ స్టాక్స్ పరుగులు పెట్టడంతో, గత 1 సంవత్సర కాలంలో, నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 65% ర్యాలీ చేసింది. అదే కాలంలో 33% లాభపడిన నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌ను డబుల్ మార్జిన్‌తో ఓవర్‌టేక్ చేసింది.
PSU బ్యాంక్ పేరు ఏడాది కాల రిటర్న్ (%)
UCO బ్యాంక్ 141
పంజాబ్ & సింధ్ బ్యాంక్ 124
జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్ 107
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 101
బ్యాంక్ ఆఫ్ బరోడా 86
ఇండియన్ బ్యాంక్ 86
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 75
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 73
బ్యాంక్ ఆఫ్ ఇండియా 68
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 59
చాలా ప్రైవేట్ రంగ బ్యాంకులు బెంచ్‌మార్క్ ఇండెక్స్ రిటర్న్స్‌ను దాటలేకపోయాయి. ఈ స్పేస్‌లో, గత 1 సంవత్సర కాలంలో మల్టీబ్యాగర్ రాబడిని అందించింది IDFC ఫస్ట్ బ్యాంక్ మాత్రమే.
ప్రైవేట్ రంగ బ్యాంక్ పేరు ఏడాది కాల రిటర్న్ (%)
IDFC ఫస్ట్ బ్యాంక్ 133
RBL బ్యాంక్ 98
ఇండస్‌ఇండ్ బ్యాంక్ 57
యాక్సిస్ బ్యాంక్ 50
ఫెడరల్ బ్యాంక్ 38
ICICI బ్యాంక్ 37
యస్ బ్యాంక్ 28
HDFC బ్యాంక్ 22
కోటక్ మహీంద్ర బ్యాంక్ 7
బంధన్ బ్యాంక్ -20
స్టాక్ పిక్స్
ప్రభుత్వ రంగ బ్యాంకుల స్పేస్‌లో వృద్ధి అవకాశం ఇంకా ఉందని చెబుతున్న బ్రోకరేజ్ స్టాక్‌బాక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా & స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద బుల్లిష్‌గా ఉంది. సామ్‌కో సెక్యూరిటీస్ కూడా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐ & బ్యాంక్ ఆఫ్ బరోడాను టాప్ బెట్స్‌గా చెబుతోంది.
మరో ఆసక్తికర కథనం: ఉద్యోగం మారారా?, ఫామ్-12B &12BA కూడా కచ్చితంగా సబ్మిట్ చేయాలి!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ నిల్వలు
Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>