అన్వేషించండి

Stock Market: బ్రిటానియా, లారస్‌ ల్యాబ్స్‌, ఎన్‌ఎండీసీపై కీలక అప్‌డేట్స్‌ - మీ దగ్గర ఈ స్టాక్స్‌ ఉన్నాయా?

కోటక్ సెక్యూరిటీస్‌లోని VP-టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే, ఈ 3 కౌంటర్లకు కీలక సిఫార్సులు చేశారు.

Stock Market Updates: రెండు సెషన్ల ర్యాలీని రివర్స్‌ చేస్తూ, ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాల్లో క్లోజ్‌ అయ్యాయి. 30 షేర్ల BSE సెన్సెక్స్ 64 పాయింట్లు క్షీణించి 66,408 వద్ద ముగియగా, నిఫ్టీ 17 పాయింట్లు పడిపోయి 19,800 స్థాయికి దిగువన క్లోజ్‌ అయింది. ఈ రోజు (శుక్రవారం, 13 అక్టోబర్‌ 2023) కూడా మధ్యాహ్నం 12 గంటల సమయానికి రెడ్‌ కలర్‌లోనే ట్రేడ్‌ అవుతున్నాయి.

మార్కెట్‌ ఫోకస్‌లో ఉన్న స్టాక్స్‌లో, గురువారం, NMDC 5.42%, బ్రిటానియా, 0.1%, లారస్ ల్యాబ్స్ 0.14% పెరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి బ్రిటానియా తప్ప మిగిలిన రెండు స్టాక్స్‌ గ్రీన్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి.

కోటక్ సెక్యూరిటీస్‌లోని VP-టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే, ఈ 3 కౌంటర్లకు కీలక సిఫార్సులు చేశారు.

NMDC - బయ్‌
గురువారం ఈ స్టాక్ తాజాగా 52-వారాల గరిష్ట స్థాయి 159.90ని నమోదు చేసింది. ఈ వారంలో ఇప్పటివరకు దాదాపు 10 శాతం ర్యాలీ చేసింది. డైలీ, వీక్లీ చార్టుల్లో బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఇది పాజిటివ్‌ సిగ్నల్‌ కాబట్టి అప్‌ట్రెండ్‌ను కంటిన్యూ చేసే పొజిషన్‌లో ఉంది.

ఇప్పుడు, బ్రేక్ ఔట్‌ ట్రేడ్స్‌ కోసం చూడాల్సిన కీలక సపోర్ట్ లెవల్‌ రూ. 152-150. ఈ లెవల్‌ పైన, ఈ షేర్లు రూ. 170-180 వరకు కదలవచ్చు. రూ. 150 కంటే తక్కువకు పడిపోతే లాంగ్ పొజిషన్ల నుంచి ట్రేడర్లు ఎగ్జిట్‌ కావడానికి ఇష్టపడొచ్చు.

బ్రిటానియా - న్యూట్రల్‌ 
సుదీర్ఘ కరెక్షన్‌ తర్వాత, ఈ స్టాక్ 200 డేస్‌ SMA (సింపుల్ మూవింగ్ యావరేజ్) సమీపంలో రేంజ్‌-బౌండ్‌ యాక్టివిటీని చూస్తోంది. టెక్నికల్‌గా, స్టాక్ డబుల్ బాటమ్ ఫార్మేషన్‌ను ఏర్పరచింది. ప్రస్తుత స్థాయుల నుంచి తాజా అప్‌ట్రెండ్ ర్యాలీకి బలమైన అవకాశాన్ని ఇది సూచిస్తోంది.

కరెక్షన్‌ దశను పూర్తి చేసుకుని 200 డేస్‌ SMA కంటే పైన నిలదొక్కుకోవడంలో ఈ స్క్రిప్‌ విజయం సాధిస్తే, అక్కడి నుంచి రూ. 4700-4750 వరకు పెరగవచ్చని ఎనలిస్ట్‌ భావిస్తున్నారు. ప్రొజిషనల్‌ ట్రేడర్లు రూ. 4425 స్థాయిని కీలక మద్దతుగా చూడాలి, దీని దిగువకు స్టాక్‌ వస్తే డౌన్‌ట్రెండ్‌ మొదలు కావచ్చు.

లారస్ ల్యాబ్స్ - బయ్‌
స్వల్పకాలిక కరెక్షన్‌ తర్వాత, ఈ స్టాక్ 50 డేస్‌ SMA దగ్గర మద్దతు తీసుకుని రివర్స్ అయింది.

టెక్నికల్‌గా, ఈ స్టాక్ 50 డేస్‌ SMA సమీపంలోపాజిటివ్‌ సానుకూల కన్సాలిడేషన్‌లో ఉంది. చార్ట్‌లను షార్ట్‌ టర్మ్‌ టైమ్‌ పిరియడ్‌లో చూస్తే, ప్రస్తుత లెవెల్స్‌ నుంచి అప్‌ట్రెండ్ ర్యాలీకి బలమైన అవకాశం కనిపిస్తోంది. 

50 డేస్‌ SMA లేదా రూ. 390 పైన ట్రేడింగ్ చేస్తున్నంత కాలం పాజిటివ్‌ సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉందన్నది ఎనలిస్ట్‌ అంచనా. ఆ స్థాయి పైన రూ. 415-420 వరకు ర్యాలీ ఉండొచ్చు. రూ. 390 దిగువన అమ్మకాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: టీసీఎస్‌ బైబ్యాక్‌తో 5-17% రిటర్న్స్‌, షార్ట్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం దీనిని ట్రై చేయొచ్చు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget