Stock Market: MFలు ఎగబడి కొన్న 20 మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్, మీ దగ్గర ఒక్కటైనా ఉందా?
ఏప్రిల్‌లో BSE మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 6%, 7.3% లాభపడ్డాయి,
Stock Market Update: ఏప్రిల్ నెలలో ఈక్విటీ మార్కెట్‌లో మంచి కొనుగోళ్లు కనిపించాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సెగ్మెంట్లలో బాగా షాపింగ్ చేయడంతో ఆ నెలలో సూచీల్లో లక్ష్మీకళ కనిపించింది.
మ్యూచువల్ ఫండ్స్, గత నెలలో ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యూటికల్, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ఆటో యాన్సిలరీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లోని స్టాక్స్‌ను కొనుగోలు చేశాయి. దీంతో, ఏప్రిల్‌లో, BSE మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 6%, 7.3% లాభపడ్డాయి, సెన్సెక్స్‌ను దాటి ముందుకెళ్లాయి. ఆ నెలలో సెన్సెక్స్ 5% లాభపడింది.
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొన్న టాప్ మిడ్ క్యాప్ స్టాక్స్:
ఐసీఐసీఐ డైరెక్ట్ సమాచారం ప్రకారం... స్టార్ హెల్త్ అలైడ్ ఇన్సూరెన్స్, పూనావాల ఫిన్‌కార్ప్, డిక్సన్ టెక్నాలజీస్, GMR ఎయిర్‌పోర్ట్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, L&T టెక్నాలజీ సర్వీసెస్, డా.లాల్ పాత్‌లాబ్స్, పిరామల్ ఎంటర్‌ప్రైజెస్, పెట్రోనెట్ LNG, L&T ఫైనాన్స్ హోల్డింగ్స్‌పై ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ బెట్స్ వేశాయి.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC, పూనావాలా ఫిన్‌కార్ప్ షేర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో 67% షేర్లను ఎక్కువగా తీసుకుంది. ఈ NBFC మేజర్ షేర్లు గత ఒక సంవత్సర కాలంలో దాదాపు 16% లాభంతో నిఫ్టీ50ని అధిగమించాయి.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, ఈ కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న MFల సంఖ్య మార్చిలోని 31 నుంచి ఏప్రిల్‌లో 52కి పెరిగింది. MFలు ఈ స్టాక్‌లో గత 4 నెలులుగా యాజమాన్యాన్ని క్రమంగా పెంచుకుంటూనే ఉన్నాయి.
సంస్థాగత ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించిన సెకండ్ టాప్ స్టాక్ డిక్సన్ టెక్నాలజీస్. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC, HDFC AMC ఏప్రిల్‌లో కంపెనీ షేర్లను కొనుగోలు చేశాయి. ఈ కౌంటర్‌లో కూడా గత 4 నెలులుగా MFల ఓనర్‌షిప్ పెరుగుతోంది.
ఫిబ్రవరి నుంచి BHELలో MF హోల్డింగ్ స్థిరంగా పెరిగింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఈ స్టాక్‌ను ఎక్కువగా కొంటోంది. ఈ స్టాక్ గత ఒక ఏడాది కాలంలో 60% రాబడితో నిఫ్టీ50ని ఔట్‌పెర్ఫార్మ్ చేసింది.
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొన్న టాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్:
PNB హౌసింగ్ ఫైనాన్స్, RHI మాగ్నెసిటా, మార్క్‌సన్స్ ఫార్మా, మాస్టెక్, CE ఇన్ఫో సిస్టమ్స్, యురేకా ఫోర్బ్స్, CMS ఇన్ఫో సిస్టమ్స్, మిండా కార్ప్, ఆల్‌కార్గో లాజిస్టిక్స్, మహానగర్ గ్యాస్ షేర్లను ఏప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్స్ తెగ కొన్నాయి.
గత నెలలో, RHI మాగ్నెసిటా స్టాక్ కనీసం ఐదు మ్యూచువల్ ఫండ్‌ల షాపింగ్ లిస్ట్‌లో ఉంది. ఈ కంపెనీ షేర్లను ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, HDFC AMC, ICICI ప్రుడెన్షియల్ AMC, నిప్పాన్ AMC కొనుగోలు చేశాయి.
గత ఒక సంవత్సర కాలంలో, RHI మాగ్నెసిటా షేర్లు నిఫ్టీ50 కంటే ఎక్కువగా దాదాపు 8% లాభపడ్డాయి. ఏప్రిల్‌లో, ఈ కంపెనీలో ఏకంగా 0.69% వాటాను ICICI ప్రుడెన్షియల్ కొనుగోలు చేసి, అతి పెద్ద కొనుగోలుదారుగా నిలిచింది.
గత ఒక సంవత్సర కాలంలో 21% రాబడితో నిఫ్టీ50 ఔట్‌పెర్ఫార్మ్ చేసిన ఆటో అనుబంధ కంపెనీ మిండా కార్పొరేషన్ షేర్లను ఆదిత్య బిర్లా AMC కొనుగోలు చేసింది. ఈ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీలో 0.44% కొనుగోలు చేసింది.
మిండా గ్రూప్ కంపెనీలో MFల పెట్టుబడులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్థిరంగా ఉన్నాయి, ఏప్రిల్ నెలలో పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.