By: ABP Desam | Updated at : 16 Mar 2022 03:57 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎగబడ్డ ఇన్వెస్టర్లు! గరిష్ఠాల్లో ముగిసిన సూచీలు, సెన్సెక్స్ 1040+
Stock Market Updates: భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) నేడు కళకళలాడాయి. వాల్‌స్ట్రీట్ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మదుపర్లు (Investors) కొనుగోళ్లకు ఎగబడ్డారు. బెంచ్‌మార్క్ సూచీలు తిరిగి రికవరీ బాట పట్టాయి. ముడి చమురు ధరలు (Crude Oil Prices) తగ్గడమూ ఇందుకు కలిసొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ (Russia Ukrain War) మధ్య శాంతి చర్చలు మొదలవుతుండటమూ ధైర్యం నింపింది. గురువారం వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులకు లోనవ్వొచ్చు. నేడు బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1039 పాయింట్లు లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,975 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,776 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) నేడు 56,553 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. అప్పట్నుంచి కొనుగోళ్లు పెరగడంతో సూచీ మరింత పైకి వెళ్లింది. 56,389 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 56,869 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1039 పాయింట్ల లాభంతో 56,816 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 16,663 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) బుధవారం 16,876 వద్ద ఆరంభమైంది. మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాల్లో పయనించింది. 16,837 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 16,987 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 312 పాయింట్ల లాభంతో 16,975 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంకు (Nifty Bank) 35,555 వద్ద మొదలైంది. 35,461 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,806 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. మొత్తంగా 725 పాయింట్ల లాభంతో 35,748 వద్ద ముగిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తప్ప మిగతా అన్ని బ్యాంకుల షేర్లు లాభాల్లో ముగిశాయి.
Gainers and Lossers
నిఫ్టీలో 47 కంపెనీల షేర్లు లాభాల్లో 3 నష్టాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సెమ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, శ్రీసెమ్ భారీ లాభాల్లో ముగిశాయి. సిప్లా, టాటా కన్జూమర్, సన్‌ఫార్మా స్వల్ప నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. ఆటో, బ్యాంక్, ఐటీ, మెటల్, పవర్ రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 2-3 శాతం మెరుగయ్యాయి.
16.03.2022
— BSE India (@BSEIndia) March 16, 2022
Pre-opening sensex update pic.twitter.com/Jkg8crTnEq
Celebrating 10 Crore (100 Million) Registered Investor Accounts (UCC) on @BSEIndia @narendramodi @narendramodi_in @PMOIndia @SEBI_India @FinMinIndia @nsitharaman @ashishchauhan @SameerPatil2019 @NeerajK_ @nayan_mehta @GIRIBSE @athakur111
— BSE India (@BSEIndia) March 16, 2022
#BSE100MillionUCC pic.twitter.com/NiZTwe6KwO
Richest South Indian Actor: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!
Penalty on TCS: వారం రోజుల్లో టీసీఎస్‌కు రెండో భారీ షాక్, Q3 లాభాలు అమెరికాపాలు!?
Latest Gold-Silver Prices Today 28 November 2023: పట్టుకోలేనంత ఎత్తులో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Car Prices To Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే తీసుకోండి, అతి త్వరలో రేట్లు పెరుగుతాయ్
Share Market Opening Today 28 November 2023: ఆరంభ శూరత్వం, ఆ వెంటనే నీరసం - ఈ రోజు మార్కెట్ల తీరిది
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>