News
News
X

Stock Market Closing: ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నుంచి పైపైకి - లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నిఫ్టీ బ్యాంక్‌ కూడా లాభాల్లో ముగిసింది. ఉదయం 39,412 వద్ద మొదలైన ఈ ఇండెక్స్‌, 39,407 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,865 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.

FOLLOW US: 

Stock Market Closing Bell 5 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ఓపెన్‌ అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty), నిఫ్టీ బ్యాంక్ (Nifty Bank) ఆ స్థాయి నుంచి ఇక కిందకు దిగలేదు. ఉదయం తొలి గంటలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. ఇంధన సరఫరా సమస్యలు పెరిగిపోవడంతో, మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) యూరప్‌ మార్కెట్లు దాదాపు 1 శాతం పైగా నష్టాల్లో ఓపెన్‌ అయినా, మన మార్కెట్లు లెక్క కూడా చేయలేదు. ఉనికి చాటుకోవడానికి బేర్స్‌ అప్పుడప్పుడు ప్రయత్నించినా ఫలించలేదు. మార్కెట్ ఆద్యంతం బుల్‌ పట్టు నడిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు పెరిగి 79.78 వద్ద ఉంది.

BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 58,803 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇవాళ (సోమవారం) 58,814 వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. 58,812 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,308 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 442 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 59,245 వద్ద ముగిసింది.

NSE Nifty
శుక్రవారం 17,539 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 17,546 వద్ద ఫ్లాట్‌గా ఓపెనైంది. 17,540 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,683 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా, 126 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 17,665 వద్ద క్లోజైంది. గత కొన్ని సెషన్లుగా, 17,700 స్థాయి వద్ద ఈ ఇండెక్స్‌ గట్టి రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోంది. ఇవాళ, దాదాపు అదే స్థాయికి వెళ్లి క్లోజయింది.

Nifty Bank
నిఫ్టీ బ్యాంక్‌ కూడా లాభాల్లో ముగిసింది. ఉదయం 39,412 వద్ద మొదలైన ఈ ఇండెక్స్‌, 39,407 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,865 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 384 పాయింట్లు లేదా 0.98% లాభంతో 39,805 వద్ద స్థిరపడింది. 39,800 స్థాయిలో దీనికి అడ్డంకి ఉంది. 

Gainers and Lossers
నిఫ్టీ50లో 35 కంపెనీలు లాభాల్లో, 15 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, సన్‌ఫార్మా టాప్‌-5 గెయినర్లు. నెస్టెల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, బ్రిటానియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐషర్‌ మోటార్స్‌ టాప్‌-5 లూజర్స్‌. అన్ని సెక్టోరియల్‌ ఇండీసెస్‌ పచ్చరంగులోనే ముగిశాయి. నిఫ్టీ మీడియా 2.75 శాతం, నిఫ్టీ మెటల్‌ 1.67 శాతం, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ 1.12 శాతం పెరిగాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 05 Sep 2022 04:34 PM (IST) Tags: Stock market sensex Nifty Share Market Nifty Bank

సంబంధిత కథనాలు

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

Gold-Silver Price 29 September 2022: బంగారం లాంటి అవకాశం, 50 వేలకు దిగువనే పసిడి ధర

Gold-Silver Price 29 September 2022: బంగారం లాంటి అవకాశం, 50 వేలకు దిగువనే పసిడి ధర

RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

Mukesh Ambani Z+ Security: ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ! నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయా?

Mukesh Ambani Z+ Security: ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ! నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయా?

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు