(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market News: వరుసగా రెండో రోజు భయపెట్టిన సూచీలు! సెన్సెక్స్ 566 డౌన్
Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా రెండో భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,807 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 566 పాయింట్లు నష్టపోయింది.
Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా రెండో భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, బ్యాంకు, ఆటో, ఐటీ షేర్లకు విక్రయాల సెగ తగలడంతో బెంచ్ మార్క్ సూచీలు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,807 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 566 పాయింట్లు నష్టపోయింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,176 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,815 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచీ సూచీ ఒడుదొడుకుల్లోనే ట్రేడైంది. 59,509 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 59,941 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ఆ తర్వాత కూడా అమ్మకాలు జరగడంతో 566 పాయింట్ల నష్టంతో 59,610 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,957 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,842 వద్ద ఓపెనైంది. 17,779 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం సమయంలో 17,901 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని అందుకుంది. చివరికి 149 పాయింట్ల నష్టంతో 17,807 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 37,711 వద్ద మొదలైంది. 37,513 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,868 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 435 పాయింట్ల నష్టంతో 37,632 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభపడగా 30 నష్టాల్లో ముగిశాయి. కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, మెటల్ సూచీలు ఒక శాతం వరకు ఎగిశాయి. బ్యాంకు, ఐటీ సూచీలు ఒక శాతం వరకు నష్టపోయాయి.