Stock Market Update: ఒకే రేంజ్‌లో మార్కెట్లు- వరుసగా 3వ రోజు స్వల్ప నష్టాలు
Stock Market Telugu update: స్టాక్ మార్కెట్ సూచీలు ఒక రేంజ్‌లోనే కదలాడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,300 దిగువన ముగిసింది.
Stock Market Telugu update: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు స్వల్ప నష్టాల్లోనే ముగిశాయి. సూచీలు ఒక రేంజ్‌లోనే కదలాడుతున్నాయి. ఫార్మా, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,300 దిగువన ముగిసింది.
BSE Sensex
క్రితం రోజు 57, 892 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,488 వద్ద నష్టాల్లోనే మొదలైంది. ఈ సూచీ రోజంతా ఊగిసలాడింది. 11:30 గంటల సమయంలో కొనుగోళ్లు పుంజుకోవడంతో ఇంట్రాడే గరిష్ఠమైన 58,175ను తాకింది. ఐరోపా మార్కెట్లు ఆరంభమైన తర్వాత సూచీ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఇంట్రాడే కనిష్ఠమైన 57,488ని తాకింది. చివరికి 59 పాయింట్ల నష్టంతో 57,832 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,236 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,236 వద్ద మొదలైంది. ఆరంభ నష్టాల నుంచి కోలుకొని 17,380 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం మళ్లీ పతనమై 17,219 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 28 పాయింట్ల నష్టంతో 17,276 వద్ద ముగిసింది.
Bank Nifty
బ్యాంకు నిఫ్టీ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 37,344 వద్ద మొదలైన సూచీ 37, 817 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సమయంలో 37,304 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 67 పాయింట్ల లాభంతో 37,599 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీలో 17 కంపెనీలు లాభపడగా 32 నష్టపోయాయి. కోల్ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌టీ లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, దివిస్ ల్యాబ్, సిప్లా, అల్ట్రాటెక్ సెమ్‌కో, ఎం అండ్ ఎం నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకు మినహాయిస్తే మిగతా అన్ని రంగాల సూచీలు ఎరుపు రంగులోనే ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ ఒక శాతం మేర పతనమయ్యాయి.