Stock Market Update: సెన్సెక్స్ 3 రోజుల్లో 2000 పాయింట్లు పతనం! గురువారమూ ఎరుపెక్కిన మార్కెట్లు
నేడు మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ 640, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 180కి పైగా పాయింట్లు పతనమయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే సెన్సెక్స్ 2000కు పైగా పాయింట్ల నష్టపోవడం గమనార్హం.
Stock Market Update Telugu: ఈ వారం స్టాక్ మార్కెట్లకు కలసిరావడం లేదు! వరుస ట్రేడింగ్ సెషన్లలో నష్టాలే చవిచూస్తున్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ 640, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 180కి పైగా పాయింట్లు పతనమయ్యాయి. ముడి చమురు ధర భారీగా పెరగడం, అమెరికా బాండ్ ఈల్డింగ్స్ పెరగడం, ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించడం, ఆసియా, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. కేవలం మూడు రోజుల్లోనే సెన్సెక్స్ 2000కు పైగా పాయింట్ల నష్టపోవడం గమనార్హం.
క్రితం రోజు 60,098 వద్ద ముగిసిన సెన్సె్క్స్ నేడు 60,045 వద్ద మొదలైంది. ఓపెనింగే ఇంట్రాడే గరిష్ఠం కావడం గమనార్హం. ఆ తర్వాత మరింత నష్టపోయిన సూచీ 59,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 634 పాయింట్ల నష్టంతో 59,464 వద్ద ముగిసింది.
బుధవారం 17,938 వద్ద ముగిసిన నిఫ్టీ గురువారం 17,921 వద్ద ఆరంభమైంది. 17,943 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. అక్కడి నుంచి విక్రయాల ఒత్తిడి పెరగడంతో 16,648 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 181 పాయింట్ల నష్టంతో 17,757 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ ఆద్యంతం ఒడుదొడుకులకు లోనైంది. ఉదయం 38,106 పాయింట్ల వద్ద మొదలైన సూచీ 38,167 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అక్కడ్నుంచి పతనమైన సూచీ 37,591 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 190 పాయింట్ల నష్టంతో 37,850 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 15 కంపెనీలు లాభపడగా 35 నష్టపోయాయి. పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్, ఇన్ఫీ, టీసీఎస్ నష్టాల్లో ముగిశాయి. పవర్, రియాల్టీ, మెటల్‌ను మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!