అన్వేషించండి

Stock Market Crash: భయం భయం! సెల్లింగ్‌ ప్రెజర్‌ - సెన్సెక్స్‌ 866, నిఫ్టీ 271 డౌన్‌

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్‌, యూరప్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడం సెంటిమెను దెబ్బతీసింది.

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్‌, యూరప్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడం సెంటిమెను దెబ్బతీసింది. అమెరికా స్టాక్స్‌ కుదేలవ్వడం ఇందుకు మరింత దోహదం చేసింది. ఉదయం నుంచి సెల్లింగ్‌ ప్రెజర్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,411 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 866 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.5 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు.  

BSE Sensex

క్రితం సెషన్లో 55,702 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,928 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. 55,070 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 54,586 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 866 పాయింట్ల నష్టంతో 54,835 వద్ద ముగిసింది.

NSE Nifty

గురువారం 16,682 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,415 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి నష్టాల్లోనే కదలాడింది. 16,484 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 16,340 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 271 పాయింట్ల నష్టంతో 16,411 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడ్‌ అయింది. ఉదయం 34,569 వద్ద మొదలైంది. 34,353 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,797 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సెల్లింగ్‌ ప్రెజర్‌ వల్ల చివరికి 641 పాయింట్ల నష్టంతో 34,591 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభపడగా 39 నష్టాల్లో ముగిశాయి. హీరో మోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఐటీసీ, ఓఎన్‌జీసీ లాభాపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, దివిస్ ల్యాబ్‌, శ్రీసెమ్‌, యూపీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 4 శాతానికి పైగా నష్టపోయాయి. శుక్రవారం సూచీలన్నీ నష్టపోయాయి. మెటల్‌, రియాల్టీ, ఐటీ సూచీలు 2-3 శాతం వరకు పతనం అయ్యాయి. పవర్‌ సూచీ మాత్రం 0.5 శాతం వరకు పెరిగింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABPKKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ-2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Embed widget