FIIs vs MFs: ఫారిన్ ఫండ్స్ Vs ఇండియన్ ఫండ్స్ - వీటి డీలింగ్స్ తెలిస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ ఈజీ అవుతుంది!
దేశీయ ఫండ్ హౌస్‌లు, Q1లో, నైకాలో యాజమాన్యాన్ని 336 bps పెంచి, మొత్తం వాటాను 8.5%కి చేర్చాయి.
FIIs vs MFs: లిస్టింగ్ తర్వాత అడ్రస్ గల్లంతైన న్యూ-ఏజ్ టెక్ స్టాక్స్ (పేటీఎం, జొమాటో, PB ఫిన్‌టెక్, నైకా, డెలివెరీ) మీద దలాల్ స్ట్రీట్ కొన్నాళ్లుగా నమ్మకం పెరుగుతోంది. జూన్ త్రైమాసికంలో పెట్టుబడుల కోసం... ఫారిన్ ఫండ్స్ (FIIలు) Paytmని ఎంచుకుంటే, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ (MFs) జొమాటో, నైకా, డెలివెరీ, PB ఫిన్‌టెక్ మీద బెట్టింగ్స్ పెంచాయి.
దేశీయ ఫండ్ హౌస్‌లు, Q1లో, నైకాలో యాజమాన్యాన్ని 336 bps పెంచి, మొత్తం వాటాను 8.5%కి చేర్చాయి. న్యూ-ఏజ్ స్టాక్స్ ప్యాక్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన వాటిలో ఇది ఒకటి, గత 12 నెలల కాలంలో దాదాపు 39% తగ్గింది.
జొమాటో విషయానికి వస్తే, జూన్ క్వార్టర్‌లో మ్యూచువల్ ఫండ్స్ వాటా 190 bps పెరిగి 8.3%కి చేరుకుంది. ఫండ్ మేనేజర్లు 2022 జూన్ నుంతి ప్రతి త్రైమాసికానికి ఈ ఫుడ్ టెక్ కంపెనీలో వాటా పెంచుకుంటూ పోతున్నారు. ఈ స్టాక్ కూడా గత ఏడాది కాలంలో 74%తో అద్భుతమైన రాబడిని ఇచ్చింది.
పేటీఎం, PB ఫిన్‌టెక్ విషయంలో మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ చాలా స్వల్పంగా మారాయి. టాప్-5 న్యూ-ఏజ్ కంపెనీల్లో, పేటీఎం షేర్లను మాత్రమే MFలు విక్రయించారు. కానీ ఫారిన్ ఇన్వెస్టర్లు ఆ షేర్లను కొన్నారు. జూన్ త్రైమాసికంలో, పేటీఎంలో FIIల ఓనర్‌షిప్ 28 బేసిస్ పాయింట్లు పెరిగింది, MFల హోల్డింగ్ 19 బేసిస్ పాయింట్లు తగ్గింది.
FIIల వాటా డెలివెరీలో 206 bps, నైకాలో 222 bps, PB ఫిన్‌టెక్‌లో 81 bps, జొమాటోల 18 bps చొప్పున తగ్గింది. ఈ షేర్లను ఫారినర్లు అమ్మితే, దేశీయ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు కొన్నాయి, వాటా పెంచుకున్నాయి.
పెట్టుబడిదార్లు ఏం చేయాలి?
జూన్ త్రైమాసికంలో Paytm 39% YoY ఆదాయ వృద్ధిని ప్రకటించింది. బ్రోకింగ్ కంపెనీ గోల్డ్‌మ్యాన్ సాచ్స్, భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ కవరేజీ వల్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా పేటీఎంను గుర్తించింది. అన్ని వ్యాపార విభాగాల్లో పేటీఎం బలంగా రాణిస్తుందని JP మోర్గాన్ కూడా ఆశిస్తోంది. నైకా ఫ్యాషన్ ఆదాయం 11% YoY పెరగొచ్చని, జొమాటో GOV గ్రోత్ మిగిలిన QSRలను ఓవర్‌టేక్ చేయవచ్చని ఈ బ్రోకరేజీ లెక్కలు కట్టింది. ఈ రెండు కంపెనీలు ఇంకా Q1 నంబర్స్ రిలిజ్ చేయలేదు.
జొమాటో, నైకా, డెలివెరీ స్టాక్స్‌కు "బయ్" రేటింగ్‌ను ICICI సెక్యూరిటీస్ ఇచ్చింది.
బ్లింకిట్ వ్యాపారంలో నష్టాలు తగ్గి, జొమాటో మొత్తం ఎబిటా లాస్ QoQలో తగ్గవచ్చని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. నైకా 31% YOY ఆదాయ వృద్ధిని రిపోర్ట్ చేయవచ్చని ఈ బ్రోకింగ్ కంపెనీ భావిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: వంద రూపాయల పెట్టుబడికి 89 రూపాయల లాభం, అదరగొట్టిన నెట్‌వెబ్ టెక్నాలజీస్ లిస్టింగ్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial