అన్వేషించండి

Share Market Opening Today: మార్కెట్లలో తీవ్ర నిరాశ - 400pts నష్టంలో సెన్సెక్స్‌, 22K దిగివన నిఫ్టీ

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ కాస్త నిలదొక్కుకున్నాయి, దాదాపు 0.8 శాతం లాభాలతో ఉన్నాయి.

Stock Market News Today in Telugu: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లలో నిన్నటి ఉత్సాహం ఈ రోజు (శుక్రవారం) లేదు. దేశీయ స్టాక్ మార్కెట్ వారంలో చివరి రోజున నష్టాల్లో ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్ల బలహీనతల ప్రభావం ప్రధాన దేశీయ సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ మీద కనిపించింది. సెన్సెక్స్ 73 వేల పాయింట్ల దిగువన ఓపెన్‌ అయింది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...

గత సెషన్‌లో (గురువారం) 73,097 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 210 పాయింట్లు తగ్గి 72,886.77 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 22,147 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 83 పాయింట్లు తగ్గి 22,064.85 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే సెన్సెక్స్ 250 పాయింట్లు పడిపోయింది. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 72,845 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు పతనమై 22,075 పాయింట్లకు చేరువైంది.

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ కాస్త నిలదొక్కుకున్నాయి, దాదాపు 0.8 శాతం లాభాలతో ఉన్నాయి.

ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 8 స్టాక్స్‌ మినహా మిగిలిన 22 కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మహీంద్ర & మహీంద్ర 1.37 శాతంతో అత్యధికంగా నష్టపోయింది. ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి షేర్లు తలా 1 శాతానికి పైగా నష్టాల్లో ఉన్నాయి. ఈ రోజు ఐటీ షేర్లపై ఒత్తిడి కనిపిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టిసీఎస్, టెక్ మహీంద్ర సహా అన్ని ప్రధాన ఐటీ షేర్లు రెడ్ జోన్‌లో ఉన్నాయి. మరోవైపు.. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు అత్యధికంగా 1.30 శాతం లాభపడ్డాయి. టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ వంటి పెద్ద స్టాక్స్‌ కూడా గ్రీన్ జోన్‌లో ఉన్నాయి.

మహారాష్ట్ర ఇంధన శాఖ నుంచి రూ.93 కోట్ల ఆర్డర్‌ అందుకున్న శక్తి పంప్స్‌ స్టాక్‌ 5% అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయింది.

UPI చెల్లింపుల్లో థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా పని చేయడానికి NPCI అనుమతి లభించడంతో పేటీఎం షేర్లు కూడా 5% అప్పర్‌ సర్క్యూట్‌లో ఆగిపోయాయి.

ఈ రోజు నుంచి పెట్రోల్ & డీజిల్ ధరలను లీటరుకు 2 రూపాయలు తగ్గించడంతో HPCL, ఇండియన్ ఆయిల్, BPCL షేర్లు 2-4 శాతం క్షీణించాయి.

ఫిచ్ రేటింగ్స్, IIFL ఫైనాన్స్‌ను 'రేటింగ్ వాచ్ నెగెటివ్'లో ఉంచడంతో ఈ స్టాక్‌ ఫ్లాట్‌గా మూవ్‌ అవుతోంది.

పన్ను అవకతవకలకు సంబంధించి అధికార్ల తనిఖీల కారణంగా బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్‌ షేర్లు ఎరుపు రంగులోకి మారాయి.

ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 432.97 పాయింట్లు లేదా 0.59% తగ్గి 72,664.31 దగ్గర; NSE నిఫ్టీ 152.10 పాయింట్లు లేదా 0.69% తగ్గి 21,996.10 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ASX200, నికాయ్‌ 0.35 శాతం వరకు క్షీణించగా, కోస్పి, హ్యాంగ్ సెంగ్, షాంఘై కాంపోజిట్ 0.5 శాతం వరకు పెరిగాయి. నిన్న, అమెరికాలో, S&P500 0.19 శాతం దిగువన ముగిసింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.54 శాతం నష్టపోయింది. వీటికి విరుద్ధంగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.1 శాతం పెరిగింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: రూ.2 తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget