Share Market Opening Today: ప్రారంభ లాభాలు ఆవిరై వేగంగా జారిపోయిన మార్కెట్లు, 6 శాతం పెరిగిన ఐటీసీ
BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం పెరిగింది. BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా దాదాపు ఫ్లాట్‌గా ఉంది.
Stock Market News Today in Telugu: రెండు రోజుల ఒత్తిడి తర్వాత, భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 13 మార్చి 2024) కాస్త ఊపిరి పీల్చుకున్నాయన్న ఆనందం ఎక్కువ సేపు నిలబడలేదు. గ్లోబల్ మార్కెట్ల నుంచి అందిన మద్దతుతో, ప్రధాన దేశీయ సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండు పాజిటివ్ నోట్‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే, మార్కెట్ ఓపెనింగ్ నుంచే ప్రారంభ లాభాలు ఆవిరవడం ప్రారంభమైంది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (మంగళవారం) 73,668 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 325 పాయింట్ల లాభంతో 73,993.40 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. మంగళవారం 22,336 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 96 పాయింట్లు పెరిగి 22,432.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 5 నిమిషాల తర్వాత, ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 73,900 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 55 పాయింట్ల బలంతో 22,390 పాయింట్ల దగ్గరలో ఉంది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం పెరిగింది. BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా దాదాపు ఫ్లాట్‌గా ఉంది.
ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 20 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ITC ధర 6 శాతానికి పైగా పెరిగింది. నెస్లే ఇండియా షేర్లు 1 శాతానికి పైగా బలపడ్డాయి. టీసీఎస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా పచ్చగా ఉన్నాయి. మరోవైపు.. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు గరిష్టంగా 1.75 శాతం నష్టపోయాయి. భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, సన్ ఫార్మా షేర్లు కూడా పడిపోయాయి.
సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.5 శాతానికి పైగా లాభాలను ఆర్జించింది. అదే సమయంలో.. నిఫ్టీ మెటల్, ఆయిల్ & గ్యాస్ సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి.
ITCలో 3.5 శాతం వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనున్నట్లు బ్రిటిష్ అమెరికన్ టొబాకో (BAT) చెప్పడంతో, ITC షేర్లు 6 శాతం పెరిగాయి.
జలాన్ కల్రాక్ కన్సార్టియంకు ఎయిర్‌వేస్ పగ్గాలను బదిలీ చేయడానికి NCLAT ఆమోదించడంతో, జెట్ ఎయిర్‌వేస్ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
సిల్వర్‌సిటీ బ్రాండ్స్ ఏజీలోని తన వాటాను 100 శాతం నుంచి 35 శాతానికి తగ్గించుకోవడంతో, ఎథోస్ షేర్లు 3 శాతం దిగి వచ్చాయి.
ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 4.01 పాయింట్లు లేదా 0.0054% తగ్గి 73,663.95 దగ్గర; NSE నిఫ్టీ 38.05 పాయింట్లు లేదా 0.17% తగ్గి 22,297.65 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
అమెరికాలో.. CPI ఇన్‌ఫ్లేషన్ MoM ప్రాతిపదికన 0.4 శాతం, YoYలో 3.2 శాతం పెరిగింది. అంచనాలకు అనుగుణంగా ఇది ఉండడంతో US సూచీలు మంగళవారం లాభపడ్డాయి. S&P500 1.12 శాతం పెరిగి 5,175.27 వద్ద సరికొత్త రికార్డును తాకింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1.54 శాతం లాభపడగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.61 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నికాయ్ 0.5 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 0.13 శాతం తగ్గాయి. దక్షిణ కొరియా కోస్పి, ఆస్ట్రేలియా ASX 200, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ 0.2 శాతం నుంచి 0.4 శాతం వరకు పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ద్రవ్యోల్బణం చల్లబడ్డా తగ్గని కిరాణా ధరల మంట, జనానికి ఇప్పటికీ చుక్కలే