Share Market Opening Today: కొత్త శిఖరంపై స్టాక్ మార్కెట్లు, సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ
BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57 పెరిగాయి.
Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 08 ఏప్రిల్ 2024) కొత్త శిఖరాలను (Stock markets at record levels) అధిరోహించాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీలు సెన్సెక్స్ 30, నిఫ్టీ 50 కొత్త ఆల్ టైమ్ హై వద్ద ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన తొలి గంటలో, 74,673.84 స్థాయి దగ్గర సెన్సెక్స్ (Sensex at fresh all-time high) కొత్త రికార్డ్ సృష్టించగా, 22,630.90 దగ్గర నిఫ్టీ (Nifty at fresh all-time high) జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ రియాల్టీ 2% పైగా పెరిగింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (శుక్రవారం) 74,248 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 307.22 పాయింట్లు లేదా 0.41 శాతం పెరుగుదలతో 74,555.44 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. శుక్రవారం 22,514 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 64.65 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో 22,578.35 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లు మరోమారు బలం ప్రదర్శించాయి. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57 పెరిగాయి.
ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 26 షేర్లు గ్రీన్ జోన్‌లో ట్రేడవుతుండగా, మిగిలిన 4 స్టాక్స్ రెడ్ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. టాటా స్టీల్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, బజాజ్ ఫిన్‌సర్వ్, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్, రిలయన్స్ చోటు దక్కించుకున్నాయి. మరోవైపు.. నెస్లే ఇండియా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, భారతి ఎయిర్‌టెల్ టాప్ లూజర్స్‌గా మారాయి.
నిఫ్టీ50 టాప్ లూజర్స్ లిస్ట్‌లో.. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి.
సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ రియాల్టీ 2 శాతం పైగా జంప్ చేసింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ 0.65 శాతం నుంచి 2 శాతం మధ్య పెరిగాయి. అన్ని సెక్టార్లలో, నిఫ్టీ ఫార్మా ఒక్కటే డల్‌గా ఉంది.
బంధన్ బ్యాంక్ MD & CEO ఘోష్ పదవి విరమణను ప్రకటించడంతో, బ్యాంక్ షేర్లు 9% పతనమయ్యాయి.
ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 379.93 పాయింట్లు లేదా 0.51% పెరిగి 74,628.15 దగ్గర; NSE నిఫ్టీ 100.50 పాయింట్లు లేదా 0.45% పెరిగి 22,614.20 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం జపాన్ నికాయ్ 1.3 శాతం, టోపిక్స్ 0.77 శాతం పెరిగాయి. దక్షిణ కొరియా కోస్పి, తైవాన్ దాదాపు 0.5 శాతం లాభపడ్డాయి. ఆస్ట్రేలియా ASX 200 0.15 శాతం స్వల్పంగా పెరిగింది. హాంగ్‌కాంగ్ హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ 0.44 శాతం పుంజుకుంది.
అమెరికన్ మార్గెట్లలో, శుక్రవారం, S&P 500 ఇండెక్స్ & నాస్‌డాక్ కాంపోజిట్ వరుసగా 1.11 శాతం & 1.24 శాతం అధిక స్థాయిలో ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.80 శాతం పెరిగింది.
అమెరికాలో మార్చి నెల జాబ్ రిపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉండడంతో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.42 శాతానికి జంప్ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్లు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 2% పతనమై $90 దిగువకు చేరింది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది, ఔన్సుకు $2,346 దగ్గర ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: అదానీ గ్రూప్ మెగా ప్లాన్, ఒక్క రంగంలోనే రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడి