(Source: ECI/ABP News/ABP Majha)
Share Market Opening: 'మంగళ'కరంగా ప్రారంభమైన మార్కెట్లు - సెన్సెక్స్ 300 pts జంప్, 25,900 దాటిన నిఫ్టీ
Share Market Updates: సోమవారం నాటి భారీ పతనం తర్వాత, ఈ రోజు ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ సహా అన్ని రంగాల్లో గ్రీన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి.
Stock Market News Updates Today 01 Oct: సోమవారం అమెరికన్ మార్కెట్లు లాభపడడంతో, ఆ ప్రభావం ఈ రోజు (మంగళవారం, 01 అక్టోబర్ 2024) ఇండియన్ స్టాక్ మార్కెట్ల మీద పడింది. నిన్నటి భారీ పతనం తాలూకు భయాలను వదిలించుకుని, నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త పాజిటివ్‌గా, మరికాస్త స్థబ్దుగా ఓపెన్ అయ్యాయి. ఓపెనింగ్ టైమ్‌లో బ్యాంక్ నిఫ్టీ 205 పాయింట్లు పెరిగింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..
గత సెషన్‌లో (సోమవారం) 84,300 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 363.09 పాయింట్లు లేదా 0.42 శాతం క్షీణతతో 84,257.17 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 25,810 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 117.65 పాయింట్లు లేదా 0.45 శాతం పతనంతో 25,788.45 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
షేర్ల పరిస్థితి
సెన్సెక్స్30 ప్యాక్‌లోని 22 స్టాక్స్ గ్రీన్‌లో 8 స్టాక్స్ రెడ్‌లో ప్రారంభమయ్యాయి. ఏసియన్ పెయింట్ 0.99 శాతం తగ్గింది. JSW స్టీల్, టాటా స్టీల్, టైటన్, హిందుస్థాన్ యూనిలీవర్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిఫ్టీ50 ఇండెక్స్‌లో, 38 స్టాక్స్ పురోగమిస్తుండగా, 12 స్టాక్స్ తిరోగమిస్తున్నాయి. టాప్ గెయినర్స్‌లో.. టెక్ మహీంద్రా 2.51 శాతం లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ & టూబ్రో, ఇన్ఫోసిస్, విప్రో కూడా ఆ తర్వాత టాప్ గెయినర్లుగా ఉన్నాయి. నిఫ్టీలో ఏషియన్ పెయింట్ 1.67 శాతం క్షీణించింది. JSW స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, సన్ ఫార్మా కూడా పడిపోయాయి.
సెక్టార్ల వారీగా...
నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ వంటి ప్రధాన రంగాల సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి, ఐటీ ఇండెక్స్ 0.89 శాతం పెరిగింది. వీటికి విరుద్ధంగా, మెటల్ ఇండెక్స్ 0.40 శాతం క్షీణించగా, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్, ఫార్మా కూడా లోయర్ సైడ్‌లో ఉన్నాయి.
BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం లాభపడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం పెరిగింది.
ఉదయం 09.55 గంటలకు, BSE సెన్సెక్స్ 180.04 పాయింట్లు లేదా 0.21% పెరిగి 84,479.82 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 48.75 పాయింట్లు లేదా 0.19% పెరిగి 25,859.60 దగ్గర ట్రేడవుతోంది.
సోమవారం, సెన్సెక్స్ & నిఫ్టీ కౌంటర్లలో భారీగా లాభాల బుకింగ్ జరిగింది. ప్రధాన ఇండెక్స్‌లు 1 శాతం పైగా పతనమయ్యాయి. BSE సెన్సెక్స్ 1,272.07 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టపోయి 84,299.78 వద్ద, నిఫ్టీ 368.10 పాయింట్లు లేదా 1.41 శాతం క్షీణించి 25,810.85 వద్ద ముగిశాయి. నిన్న.. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 & నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.38 శాతం & 0.32 శాతం తగ్గాయి.
గ్లోబల్ మార్కెట్లు
భవిష్యత్తులో రేట్ల తగ్గింపు దూకుడుగా ఉండదని ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, చైనా సహా చాలా ఆసియా మార్కెట్లకు ఈ రోజు పబ్లిక్ హాలిడే. గోల్డెన్ వీక్ వేడుకల చైనాలో మార్కెట్లుకు ఈ వారమంతా సెలవు. సోమవారం 4.8 శాతం క్షీణించిన జపాన్ నికాయ్, ఈ రోజు 1.73 శాతం లాభపడగా, టోపిక్స్ 1.43 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 ఇండెక్స్ 0.47 శాతం పడిపోయింది, ఆల్-టైమ్ హై నుంచి వెనక్కి తగ్గింది.
సోమవారం, అమెరికాలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.04 శాతం పెరిగి 42,330.15 వద్ద, S&P 500 ఇండెక్స్ 0.42 శాతం పెరిగి 5,762.48 వద్ద, నాస్‌డాక్ కాంపోజిట్ 0.38 శాతం పెరిగి 18,189.17 వద్ద క్లోజ్ అయ్యాయి. నెల రోజుల్లో, S&P 500 ఇండెక్స్ 2.01 శాతం లాభపడింది, గత త్రైమాసికంలో 5.53 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: చమురు రేట్ల మంటబెట్టిన ఇజ్రాయెల్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి