Stock Market News: సెన్సెక్స్, నిఫ్టీ ఈ వారంలో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయులను చేరతాయా, మొగ్గు ఎటు వైపు ఉంది?
దేశీయ బెంచ్‌మార్క్‌లు (Sensex, Nifty) ప్రస్తుత రికార్డులను అధిగమించే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత బయింగ్ మొమెంటం & టెక్నికల్ అనాలిసిస్ కలిసి సిగ్నల్స్ ఇస్తున్నాయి.
Stock Market News: ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయులకు ఎగబాకుతాయా?, ఈ ప్రశ్నకు సానుకూల సమాధానాలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో కొత్త బలం, ఫారిన్ ఫండ్ ఇన్ ఫ్లోస్ (విదేశీ పెట్టుబడులు) పెరిగిన నేపథంలో, ఈక్విటీలను పుష్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశీయ బెంచ్‌మార్క్‌లు (Sensex, Nifty) ప్రస్తుత రికార్డులను అధిగమించే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత బయింగ్ మొమెంటం & టెక్నికల్ అనాలిసిస్‌లు సిగ్నల్స్ ఇస్తున్నాయి.
శుక్రవారం, సెన్సెక్స్ 1,181 పాయింట్లు లేదా 1.95% పెరిగి 61,795 వద్ద ముగిసింది. నిఫ్టీ 321 పాయింట్లు లేదా 1.78% పెరిగి 18,349 వద్ద ముగిసింది.
ఈ రెండు బెంచ్‌మార్క్ సూచీలు రికార్డు గరిష్ట స్థాయికి దాదాపు 1 నుంచి 1.5% దూరంలో ఉన్నాయి. 2021న అక్టోబర్ 19, రెండు బెంచ్‌మార్క్ సూచీలు ఆల్ టైమ్ హైస్‌ను తాకాయి. సెన్సెక్స్ 62,245 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,604 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్టాల్లో ఉన్నాయి.
ఐదో ప్రయత్నం ఫలిస్తుందా?
గత ఏడాది కాలంగా చూస్తే... సెన్సెక్స్, నిఫ్టీ నాలుగు సార్లు వాటి ఆల్ టైమ్ గరిష్ట స్థాయుల దగ్గరకు వెళ్లాయి. అయితే, రికార్డ్ మార్క్‌ను దాటడంలో విఫలమయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం లెక్కలు ఇండియా సహా గ్లోబల్ మార్కెట్ల ముందు కాళ్లకు బంధం వేశాయి. తాజాగా పరిస్థితి తేరుకుంది. యూఎస్‌లో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా ఉండటంతో, వడ్డీ రేట్ల పెంపులో US ఫెడరల్ రిజర్వ్ దూకుడు తగ్గుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ వారంలో విడుదల కానున్న US అక్టోబర్ నెల రిటైల్ సేల్స్ డేటా కోసం పెట్టుబడిదారులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇది కూడా అంచనాల తగ్గట్లు ఉంటే, మార్కెట్లలో ఉత్సాహం పెరుగుతుంది.
భారతదేశ ఫండమెంటల్స్ & స్థూల ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా ద్రవ్యోల్బణం & ఆర్థిక వృద్ధి అంశాల్లో US సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగ్గా ఉందని IDBI మ్యూచువల్ ఫండ్ రిపోర్ట్ చేసింది.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు శుక్రవారం నెట్ బయ్యర్స్‌గా ఉన్నారు. నికరంగా ₹3,958.23 కోట్ల విలువైన ఇండియన్ షేర్లను కొనుగోలు చేశారు. క్యాష్ సెగ్మెంట్‌లో, ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు ₹23,000 కోట్ల నికర కొనుగోళ్లు చేపట్టారు. అక్టోబర్ చివరి వారంలోనే ₹16,500 విలువైన పెట్టుబడులు కుమ్మరించారు.
మరో బిగ్ ర్యాలీకి సిద్ధం!
టెక్నికల్‌గా చూస్తే.. వీక్లీ, డైలీ.. రెండు స్కేల్స్‌లోనూ షార్ట్ & లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్‌ల కంటే పైన నిఫ్టీ ప్రస్తుతం ట్రేడవుతోంది. RSI, DI, MCAD పికప్‌లో ఉన్నాయి. దీనిని బట్టి, మరో రెండు రెండు ట్రేడింగ్ సెషన్‌లలో ఫ్రెష్ ఆల్ టైమ్ హైని నిఫ్టీ స్కేల్ చేసే అవకాశం ఉందని ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. 18,650-18,750 స్థాయులను పరీక్షించవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుత స్థాయి నుంచి 1.6-2.2% ర్యాలీని లెక్క కట్టారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.