By: ABP Desam | Updated at : 21 Apr 2022 12:15 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market @ 12PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా రెండో రోజు లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఓపెనవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండటం మదుపర్లలో జోష్ పెంచాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,338 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 731 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,037 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,458 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచి అదే జోరు కొనసాగిస్తోంది. 57,311 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకొని 57,801 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 731 పాయింట్ల లాభంతో 57,768 వద్ద ట్రేడ్ అవుతోంది.
NSE Nifty
బుధవారం 17,136 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,234 వద్ద ఓపెనైంది. ఉదయం 17,215 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కొనుగోళ్లు పుంజుకోవడంతో 17,350 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 202 పాయింట్ల లాభంతో 17,338 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 36,513 వద్ద మొదలైంది. 36,395 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,644 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 298 పాయింట్ల లాభంతో 36,613 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభపడగా 8 నష్టాల్లో ముగిశాయి. కోల్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, సిప్లా, ఓఎన్‌జీసీ, హిందాల్కో స్వల్పంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెటల్ మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఒక శాతం వరకు ఎగిశాయి.
Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం
Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి
Delhivery Listing Price: డెల్హీవరీ లిస్టింగ్ ప్రీమియం తక్కువే! ముగింపులో రూ.49 లాభం
Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి! రేంజ్బౌండ్లో కదలాడిన సూచీలు చివరికి..!
Cryptocurrency Prices Today: భారీ నష్టాల్లో క్రిప్టోలు! బిట్‌కాయిన్ @ రూ.24.20 లక్షలు
Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి