News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Market Holiday: స్టాక్‌ మార్కెట్‌కు బక్రీద్‌ సెలవు బుధవారమా, గురువారమా?

బక్రీద్‌ పండుగ సెలవు బుధవారమా, గురువారమా అన్న కన్‌ఫ్యూజన్‌ ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది.

FOLLOW US: 
Share:

Stock Market Holiday on Bakrid: ఈ వారం ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌ ట్రేడింగ్‌ టైమ్‌ ఒకరోజు తగ్గిపోతుంది. మార్కెట్‌ 5 రోజులకు బదులు 4 రోజులే పని చేస్తుంది. ఈ వారంలో బక్రీద్ పండుగ (Holiday Festival) ఉంది. కాబట్టి, బక్రీద్‌ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. 

 బక్రీద్‌ సెలవు బుధవారమా, గురువారమా?
అయితే, బక్రీద్‌ పండుగ సెలవు బుధవారమా, గురువారమా అన్న కన్‌ఫ్యూజన్‌ ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది.

2023 జూన్ 29న (గురువారం) దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-అజా లేదా బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి, దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు (NSE) జూన్ 29న సెలవు ప్రకటించారు. గతంలో విడుదల చేసిన హాలిడేస్‌ లిస్ట్‌లో, స్టాక్‌ మార్కెట్‌కు జూన్ 28న (బుధవారం) బక్రీద్‌ సెలవు ప్రకటించారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం జూన్ 29న బక్రీద్‌ హాలిడే ప్రకటించింది. దానికి అనుగుణంగా, రెండు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవు రోజును జూన్‌ 29కి మార్చాయి.

"బక్రీద్ సందర్భంగా జూన్ 29, 2023న దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించడం జరిగింది. నోటిఫికేషన్ ప్రకారం, జూన్ 28, 2023కి బదులుగా, జూన్ 29, 2023న రోజు మొత్తం NSE & BSEలో ట్రేడింగ్ లేదా వ్యాపార కార్యకలాపాలు జరగవు" అని కొత్త నోటిఫికేషన్‌లో NSE ప్రకటించింది.

ఐడియాఫోర్జ్‌ IPO సబ్‌స్క్రిప్షన్ తేదీల్లోనూ మార్పు
స్టాక్ మార్కెట్‌ సెలవు రోజులో మార్పు కారణంగా, ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ టెక్నాలజీ లిమిటెడ్‌ IPO (ideaForge Technology Limited IPO) సబ్‌స్క్రిప్షన్ తేదీ కూడా మారింది. ఇంతకుముందు షెడ్యూల్‌ ప్రకారం, ఈ IPO జూన్ 29, 2023 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఇప్పుడు, ఈ IPOకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి బుధవారం వరకు, అంటే జూన్ 28 వరకు మాత్రమే సమయం ఉంది.

జూన్ నెలలో స్టాక్ మార్కెట్‌కు వచ్చిన ఏకైక సెలవు రోజు బక్రీద్‌. ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌కు మొత్తం 15 సెలవులు (శని, ఆదివారాలు కాకుండా) ప్రకటించారు. బక్రీద్ తర్వాత, ఆగస్ట్ 15న, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు ఉంటుంది.

2023లో మిగిలివున్న స్టాక్ మార్కెట్‌ సెలవులు:

ఆగస్ట్ 15, 2023 - స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు
సెప్టెంబర్ 19, 2023 - గణేష్ చతుర్థి కారణంగా సెలవు
అక్టోబర్ 2, 2023 - గాంధీ జయంతి కారణంగా సెలవు
అక్టోబర్ 24, 2023 - దసరా కారణంగా సెలవు
నవంబర్ 14, 2023 - దీపావళి కారణంగా సెలవు
నవంబర్ 27, 2023 - గురునానక్ జయంతి కారణంగా సెలవు
డిసెంబర్ 25, 2023 - క్రిస్మస్ కారణంగా సెలవు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: జులై 1న HDFC కవలల మెగా మెర్జర్‌, 13 నుంచి ఆ షేర్లు కనిపించవు 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 27 Jun 2023 04:28 PM (IST) Tags: bakrid Holiday Stock Market BSE. NSE

ఇవి కూడా చూడండి

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

Bank Holidays: మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! - ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్‌

Bank Holidays: మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! - ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్‌

టాప్ స్టోరీస్

Telangana Election Result 2023: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Result 2023: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Telangana Election Results 2023: విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు చేస్తే కఠిన చర్యలు - నేతలు, కార్యకర్తలకు అలర్ట్

Telangana Election Results 2023: విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు చేస్తే కఠిన చర్యలు - నేతలు, కార్యకర్తలకు అలర్ట్