అన్వేషించండి

Multibagger Stock: ఏడాదిలో నాలుగు రెట్ల రాబడి... బ్యాంక్‌లో కాదు, మార్కెట్‌లోని ఈ స్టాక్‌ను చూడండి

ఈ షేర్ ధర గత ఆరు నెలల్లోనే 110 శాతానికి పైగా పెరిగింది.

Best Multibagger Stock: మీ డబ్బు ఏడాదిలో రెట్టింపు అవుతుందని ఎవరైనా చెబితే, కామన్‌ సెన్స్‌ ఉన్న ఏ వ్యక్తి ఆ మాటలు నమ్మడు. అది ఉత్తుత్తి ప్రచారం లేదా ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడని అనుకుంటారు. ఎందుకంటే, బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే డబ్బు డబుల్‌ కావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది, ఒక్క సంవత్సరంలో ఎలా రెట్టింపు అవుతుందన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. అదే సమయంలో... డబ్బు ఏడాదిలోనే నాలుగైదు రెట్లు పెరుగుతుందని చెబితే అసలే నమ్మరు. కానీ, నిజం ఎదురుగా కనిపిస్తుంటే కొన్ని విషయాలను నమ్మక తప్పదు.

అసాధ్యం అన్న పదం స్టాక్ మార్కెట్‌లో ఉండదు. కేవలం ఒక్క రాత్రిలోనే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. లక్షాధికార్లు బిచ్చమెత్తుకుంటారు, కాణీకి ఠికాణా లేని వాడు కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇలాంటి మ్యాజిక్‌ చేయగల షేర్లు స్టాక్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. వాటిలో, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited - RVNL) ఒకటి. 

గత కొన్ని నెలలుగా అప్‌ ట్రెండ్
శుక్రవారం (01 సెప్టెంబర్‌ 2023) ట్రేడింగ్ ముగిసే సమయానికి, రైల్ వికాస్ నిగమ్ షేర్‌ ధర 5.65 శాతం జంప్‌తో రూ. 138.45 వద్ద ముగిసింది. అంతకుముందు, గురువారం రోజు 10 శాతం పతనమైంది. ఓవరాల్‌గా చూస్తే, ఈ స్టాక్‌ గత ఐదు రోజుల్లో 11 శాతానికి పైగా పెరిగింది. గత నెల రోజుల కాలంలో ఈ కౌంటర్‌లో క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగాయి, వృద్ధి దాదాపు 12 శాతానికి పరిమితం అయింది.

ఆరు నెలల్లో డబ్బు రెట్టింపు 
అయితే, కాస్త ఎక్కువ టైమ్‌లో చూస్తే మాత్రం, RVNL షేర్లు మైండ్‌ బ్లోయింగ్‌ రిటర్న్స్‌ ఇచ్చాయి. ఈ షేర్ ధర గత ఆరు నెలల్లోనే 110 శాతానికి పైగా పెరిగింది. అంటే, ఆరు నెలల లోపే ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్‌ 100 శాతానికి పైగా పెరగ్గా, గత ఒక ఏడాది కాలంలో 322 శాతానికి పైగా (దాదాపు 4 రెట్లు) పెరిగింది.

ఏడాది క్రితం నుంచి కంటిన్యూ అయిన మ్యాజిక్‌
ప్రస్తుతం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షేర్‌ రూ. 138.45 స్థాయిలో ఉన్నప్పటికీ, కొన్ని రోజుల క్రితం రూ. 146.65 స్థాయిని తాకింది. ఇది గత 52 వారాల్లో (ఏడాది కాలంలో) రైల్ వికాస్ నిగమ్ షేర్‌ ప్రైస్‌లో అత్యధిక స్థాయి. ఒక సంవత్సరం క్రితం, అంటే 2022 సెప్టెంబర్ ప్రారంభంలో, ఒక షేరు ధర రూ. 32 దగ్గర ఉంది. ఈ విధంగా,  RVNL స్టాక్ ఒక్క ఏడాదిలోనే నాలుగున్నర రెట్లు వృద్ధిని కనబరిచింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget