అన్వేషించండి

Starlink vs Reliance Jio: మస్క్‌ vs అంబానీ! ఆ వైపు టాటా, ఎయిర్‌టెల్‌, అమెజాన్‌ ఈ వైపు వొడాఐడియా!

Starlink vs Reliance Jio: ఇండియన్‌ స్పేస్‌ స్పెక్ట్రమ్‌ వ్యవహారం ఒక పట్టాన తేలేలా కనిపించడం లేదు. ప్రపంచ, స్థానిక కుబేరులు ఒక్క తాటిపైకి రావడం కష్టమే అనిపిస్తోంది.

Starlink vs Reliance Jio: 

ఇండియన్‌ స్పేస్‌ స్పెక్ట్రమ్‌ వ్యవహారం ఒక పట్టాన తేలేలా కనిపించడం లేదు. ప్రపంచ, స్థానిక కుబేరులు ఒక్క తాటిపైకి రావడం కష్టమే అనిపిస్తోంది. ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా వేలం వైపు ఉన్నాయి. ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌, సునిల్‌ మిట్టల్‌ భారతీ ఎయిర్‌టెల్‌, అమెజాక్‌ కూపర్‌, టాటా కంపెనీలు లైసెన్సింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

సిగ్నల్‌ను తీసుకొచ్చే స్పెక్ట్రమ్‌ లేదా ఎయిర్‌వేస్‌ను వేలం వేయొద్దని ఎలన్‌ మస్క్‌ నొక్కి చెప్తున్నారు. స్టార్‌లింక్‌ సర్వీసులకు లైసెన్స్‌ ఇస్తే చాలని పేర్కొంటున్నారు. టాటా, ఎయిర్‌టెల్‌, అమెజాన్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. డేటా, వాయిస్‌ సర్వీసులు అందించే విదేశీ సాటిలైట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు స్పెక్ట్రాన్ని వేలం వేయాలని రిలయన్స్‌ అంటోంది. ఇవే సర్వీసులు అందిస్తున్న టెలికాం ప్రొవైడర్లుకు ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ వేస్తున్న సంగతి గుర్తు చేస్తోంది.

'భారత అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్‌ సర్వీసుల (SS) స్పెక్ట్రమ్‌ నిర్ణయం అత్యంత కీలకం అవుతుంది. 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తోంది. ఇప్పటి వరకు వరకు 77 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఇప్పుడు స్పేస్‌ స్పెక్ట్రమ్‌పై పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కన్నేశాయి' అని సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజీ తెలిపింది. అమెజాన్‌కు చెందిన కూపర్‌, టాటా, భారతీ ఎయిర్‌టెల్‌ మద్దతు ఇస్తున్న వన్‌వెబ్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో వేలానికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంది. రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా వేలానికి అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. 

కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పేస్‌ స్పెక్ట్రాన్ని వేలం వేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్టు తెలిసింది. అలాగైతే విదేశీ కంపెనీలు స్థానికంగా పెట్టుబడులు పెడతాయని భావిస్తోంది. అలాగే స్పేస్‌ స్పెక్ట్రమ్‌ ఉపయోగించుకొనే ఓటీటీ వేదికల కంటెంట్‌పై నియంత్రణ చేపట్టొచ్చని భావిస్తున్న అంతర్గత వర్గాలు తెలిపాయి.

అంతర్జాతీయ స్థాయిలో స్పెక్ట్రమ్‌ నిర్వహణను ఐటీయూ చూసుకుంటుంది. ఉపగ్రహ క్షక్షా వనరులు, కొత్త ఉపగ్రహాలు ఇతర ఉపగ్రహాలను ఢీకొట్టకుండా కోఆర్డినేట్స్‌ను ప్లాన్‌ చేసుకోవడం, ఆర్బిట్‌ స్లాట్స్‌, ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు దీని పరిధిలోనే ఉన్నాయి. అయితే ఉపగ్రహాలకు గేట్‌వే లింక్స్‌, యూజర్స్‌ లింక్స్‌ లైసెన్స్‌లకు స్పెక్ట్రమ్‌ కేటాయింపులు భారత ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి.

ఇప్పటికైతే వన్‌వెబ్‌ ఇండియా, జియో సాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌కు టెలికాం శాఖ లైసెన్సులు ఇచ్చింది. అయితే స్పేస్‌ స్పెక్ట్రమ్‌ విధానాల కోసం వేచి చూస్తోంది. ఎల్‌-బ్యాండ్‌, ఎస్‌-బ్యాండ్‌ యూజర్‌ లింక్స్‌, హైయ్యర్‌ బ్యాండ్స్‌ అయిన C, Ku, Kaకు జాతీయ లేదా సర్కిల్‌ స్థాయిలో వేలం వేస్తారా? లేదా అడ్మినిస్ట్రేటివ్‌ పద్ధతిలో అనుమతినిస్తారా అని ఎదురు చూస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కీలకమైన అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో ఎస్‌ఎస్‌, ఆర్బిటల్‌ స్లాట్స్‌ కోసం మొదట స్పేస్‌ స్పెక్ట్రమ్‌ను వేలం వేశారు. ఆ తర్వాత లైసెన్సింగ్‌ విధానానికి మారారు. భారత సాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ వేలంపై పారిశ్రామిక వర్గాల నుంచి అభిప్రాయాలు కోరగా 64 మంది స్పందించారు. 48 మంది లైసెన్సింగ్‌, 12 మంది వేలానికి ఓటేశారు. మిగిలిన వాళ్లు తటస్థంగా ఉన్నారని తెలిసింది.

స్టార్‌ లింక్‌కు ప్రపంచ వ్యాప్తంగా 84 లైసెన్సులు ఉన్నాయి. దాదాపుగా 1.5 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. భారత్‌లో స్పేస్‌ స్పెక్ట్రమ్‌ను భాగస్వామ్యం పద్ధతిలో కేటాయించి లైసెన్స్‌ ఇవ్వాలని మస్క్‌ కోరుతున్నారు. వన్‌వెబ్‌ సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తోంది. భాగస్వామ్య పద్ధతిలో అన్ని కంపెనీలకు స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని, అనారోగ్యకరమైన పోటీ వద్దని సూచిస్తోంది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget