Jasprit Bumrah: శ్రీ టీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెటర్ ‘జస్ప్రీత్ బుమ్రా’
SriTMT Steel Brand Ambassador: ప్రముఖ క్రికెటర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
Latet Telugu News: ప్రముఖ క్రికెటర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చాలా మంది క్రికెటర్లు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారి బాటలోనే ‘జస్ప్రీత్ బుమ్రా’ కూడా వెళ్లుతున్నారు. శ్రీ టీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జస్ప్రీత్ బుమ్రా’ ను దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ప్రకటించింది. శ్రేష్ఠమైన ఉత్పత్తులను అందించడంలో శ్రీ టీఎంటీ సంస్థ వారికున్న తపనను వివరిస్తూ.. దీని కోసం బుమ్రా సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహిస్తారంటూ పేర్కొంది.
ప్రపంచంలోనే అగ్రగామిగా..
నేడు నిర్మాణ ప్రపంచంలో శ్రీ టీఎంటీ స్టీల్ అగ్రగామిగా నిలిచింది. శ్రీ టీఎంటీ స్టీల్ అనేది దేవ శ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ధృడమైన, దీర్ఘకాలం మన్నికైన, ఫ్లెక్సిబిలిటీకి పేరుగాంచిన శ్రీ టీఎంటీ బార్లు తెలివైన ప్రతి బిల్డర్‌ల మొదటి ఎంపికగా చాలా కాలంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘జస్ప్రీత్ బుమ్రా’ ను ప్రకటించింది.
అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న బూమ్రా
బుమ్రా తన అద్భుతమైన ఆట తీరుతో అందరికీ సుపరిచితుడైన వ్యక్తి. ఆయన మన భారతదేశంలో ఎంతో మంది యువ ఆటగాళ్లకి ఆదర్శం. అలాగే మన దేశం తరఫున ఇప్పటి వరకు ఆడిన వారిలో గొప్ప ఫాస్ట్ బౌలర్గా బూమ్రా పేరు సంపాదించాడు. ఈ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. శ్రీ టీఎంటీ సంస్థ వారి బ్రాండ్ అంబాసిడర్‌గా తనను ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. అన్నింటికంటే నాణ్యత, విశ్వసనీయతకు ప్రాధాన్యతనిచ్చే బ్రాండ్‌తో అనుబంధం కావడం అనేది ఒక గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.
మా ఉత్పాదన రంగంలో నిరంతరం రాణించడానికి.. ప్రతిసారీ ఉత్తమమైన ఫలితాలని అందించడానికి.. బుమ్రా మా సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని దేవశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రకాష్ గోయెంకా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట సింగిల్ రిబ్బెడ్ బార్‌లతో తాము ప్రారంభించామని.. తరువాత 2X , 3X బార్లను తయారు చేయడం ప్రారంభించామని తెలిపారు. ప్రతిసారీ తాము తమ ఉత్పత్తిలో అధిక ధృడమైన, దీర్ఘకాలం మన్నికైన బార్లను తయారు చేయడాన్ని లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. ఇది టీఎంటీ బార్‌లు, స్టీల్ ఉత్పత్తుల తయారీలో భారతదేశపు ప్రముఖ తయారీ దారులలో ఒకటిగా నిలిచింది.
డైరెక్టర్ నీరజ్ గోయెంకా మాట్లాడుతూ, “మా కస్టమర్లకు ప్రీమియం ఉత్పత్తిని అందించడానికి.. డీలర్లు, బిల్డర్లకు అత్యుత్తమ విలువను అందించడానికి అంకితభావంతో పనిచేస్తున్నాం. ఉక్కు రంగంలో మాకు 50ఏళ్లకు పైగా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాం. నాణ్యమైన ఉత్పత్తులు, సేవలకు పరిశ్రమలో విశ్వసనీయమైన టీఎంటీ స్టీల్ రాడ్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారయ్యాయి. హై-ఎండ్‌లో ఉపయోగించడానికి ఇవి చాలా అనువైనవి.. నిర్మాణ ప్రాజెక్టులు ఇవి అత్యంత మన్నికైనవని” అని తెలిపారు.