LIC Shares: ఆరు నెలల గరిష్టానికి ఎల్‌ఐసీ షేర్లు, అక్టోబర్ నుంచి లాభాల బాట
ఈ ఏడాది అక్టోబర్ అర్ధభాగం తర్వాతి నుంచి ఈ స్టాక్ పుంజుకుంది.
LIC Shares: ఇవాళ్టి (మంగళవారం, 20 డిసెంబర్ 2022) నష్టాల మార్కెట్‌లోనూ, ఇంట్రా డే ట్రేడ్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) షేర్లు లాభపడ్డాయి. BSEలో 3 శాతం లాభంతో, ఆరు నెలల గరిష్ట స్థాయి రూ. 754.40 కి చేరుకున్నాయి. ఈ ఏడాది (2022) జూన్ 7వ తేదీ తర్వాత, ఇప్పుడు, గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.
ప్రభుత్వ యాజమాన్యంలో పని చేసే బీమా కంపెనీ స్టాక్ గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 10 శాతం ర్యాలీ చేసింది. గత నెల రోజుల కాలంలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 1 శాతం క్షీణతతో పోలిస్తే, LIC స్టాక్ ధర దాదాపు 18 శాతం పెరిగింది. గత ఆరు నెలల కాలంలో 11 శాతం పైగా ర్యాలీ చేసింది. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) చూస్తే, దాదాపు 16 శాతం పతనమైంది. ఈ ఏడాది అక్టోబర్ అర్ధభాగం తర్వాతి నుంచి ఈ స్టాక్ పుంజుకుంది.
జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, ప్రైవేట్ రంగంలో పని చేసే ఒక ప్రొఫెషనల్‌ను తీసుకొచ్చి LIC ఫస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరాశాజనకమైన స్టాక్ మార్కెట్ అరంగేట్రం తర్వాత, ఈ బీమా సంస్థను ఆధునీకరించాలని యోచిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో, బీమా కంపెనీ భవిష్యత్తులో వెలిగిపోతుందన్న అంచనాలతో ఈ స్టాక్ మీద ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పెరిగింది.
మెరుగుపడిన వృద్ధి & లాభదాయకత
2022 నవంబర్‌లో, LIC ఫస్ట్ ఇయర్ ప్రీమియం 50.5 శాతం పెరిగింది, 2021 నవంబర్‌తో పోలిస్తే 32 శాతం వృద్ధి కనిపించింది. ఇదే సమయంలో, ప్రైవేట్ బీమా సంస్థలు నవంబర్ 2022లో 1.9 శాతంతో ఫ్లాట్ గ్రోత్ రేటును నమోదు చేశాయి, అక్టోబర్ 2022లో వీటి వృద్ధి 11 శాతంగా, నవంబర్ 2021లో 58.6 శాతంగా ఉంది. ఈ స్థాయి నుంచి నవంబర్ 2022లో భారీగా తగ్గాయి. ఇదే కాలంలో LIC గణనీయమైన వృద్ధిని సాధించింది.
టెక్నికల్ వ్యూ
బయాస్: సానుకూలం
టార్గెట్: రూ. 768; రూ. 800
సపోర్ట్: రూ. 720
ఈ స్టాక్ రూ. 720 స్థాయి కంటే పైన ఉన్నంత వరకు, అంటే, వీక్లీ బొలింగర్ బ్యాండ్ హయ్యర్ ఎండ్‌లో ఉన్నంత వరకు, ఇన్వెస్టర్లు పాటిజివ్ బయాస్‌తో ఉండే అవకాశం ఉంది.
డైలీ స్కేల్‌లో... 20 DMA, 50 DMA, 100 DMA కంటే పైన, వరుసగా రూ. 669, రూ. 639, రూ. 651 పైన కదులుతోంది. మొత్తం ట్రెండ్ సానుకూలంగా ఉందని ఇది సూచిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.