అన్వేషించండి

Lock-In Periods: అతి త్వరలో మార్కెట్‌లోకి షేర్ల సునామీ, గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లు

గడువు ముగిసి లాక్‌ ఓపెన్‌ అయితే ఆ షేర్లను అమ్ముకునే స్వేచ్ఛ వస్తుంది.

Lock-In Periods: గత రెండు సంవత్సరాల్లో పబ్లిక్‌గా మారిన (ప్రభుత్వ రంగ సంస్థలు మినహా‌) దాదాపు 40 కంపెనీల నుంచి దాదాపు $12 బిలియన్ల విలువైన షేర్లు అతి త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే నాలుగు నెలల్లో ఆయా షేర్ల లాక్‌-ఇన్‌ పిరియడ్స్‌ ముగుస్తాయి. ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఇద్దరికీ లాక్-ఇన్ గడువులు ముగిసే టైమ్‌ దగ్గర పడింది. వాళ్లు అమ్మకాలకు దిగితే, మార్కెట్‌లోకి షేర్ల వరద పారుతుంది. సప్లై పెరిగితే షేర్‌ ప్రైస్‌లు పడిపోతాయి. కాబట్టి, లాక్‌-ఇన్‌ గడువులపై ఓ కన్నేసి ఉంచడం ముఖ్యం.

మ్యాన్‌కైండ్ ఫార్మా, కేన్స్ టెక్నాలజీస్, గ్లాండ్ ఫార్మా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సెన్కో గోల్డ్ వంటి కౌంటర్లపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది. 

LIC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్, మజగాన్‌ డాక్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల లాక్-అప్ షేర్ల విలువ చాలా ఎక్కువగా ఉంది, మొత్తం $13 బిలియన్ల వరకు ఉంటుంది. వాటి లాక్-ఇన్‌ల గడువు వచ్చే నాలుగు నెలల్లో ముగుస్తుంది.

ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ టైమ్‌ లోపల వాళ్లు షేర్లు అమ్మడానికి వీలుండదు. గడువు ముగిసి లాక్‌ ఓపెన్‌ అయితే ఆ షేర్లను అమ్ముకునే స్వేచ్ఛ వస్తుంది. అయితే, లాక్‌-ఇన్‌ గడువు ముగియగానే స్టాక్స్‌ను ఆఫ్‌లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాటిని అమ్మకుండా హోల్డ్‌ కూడా చేయవచ్చు. అమ్మాలా, వద్దా అన్నది కంపెనీ ఫండమెంటల్స్‌, బిజినెస్‌ మోడల్‌, లాంగ్‌టర్మ్‌ గ్రోత్‌ మీద ఆధారపడి ఉంటుంది.

వచ్చే 4 నెలల్లో లాక్‌-ఇన్‌ పిరియడ్స్‌ ముగిసే స్టాక్స్‌:

మ్యాన్‌కైండ్‌ ఫార్మా -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Nov 06, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 400.6; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 280.4; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 70.0; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 6,079

కేన్స్ టెక్ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Nov 20, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 58.1; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 25.3; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 43.6; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 778

గ్లాండ్ ఫార్మా -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Nov 02, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 163.3; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 32.7; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 20.0; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 658

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Jan 19, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 1,095.9; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 662.8; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 60.5; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 469

సెన్కో గోల్డ్ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Jan 12, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 77.7; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 46.7; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 60.1; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 363

ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Nov 10, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 100.6; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 48.5; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 48.2; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 345

సైయెంట్ DLM -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Jan 05, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 79.3; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 41.0; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 51.7; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 330

నెట్‌వెబ్ టెక్ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Jan 25, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 56.1; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 31.3; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 55.9; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 307

హ్యాపీయెస్ట్ మైండ్స్ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Dec 30, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 146.9; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 29.4; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 20.0; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 303

ఈథర్ ఇండస్ట్రీస్‌ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Dec 04, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 124.5; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 24.9; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % ; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 

HMA ఆగ్రో ఇండస్ట్రీస్‌ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Jan 11, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 50.1; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 31.8; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 63.5; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 278

అవలాన్ టెక్ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Oct 13, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 65.3; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 32.4; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 49.6; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 223

ఐడియాఫోర్జ్ టెక్నాలజీ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Jan 08, 2024; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 41.7; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 22.2; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 53.2; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 220

క్యాంపస్ యాక్టివ్‌వేర్ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Nov 04, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 304.3; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 60.9; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 20.0; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 211

రెస్టారెంట్ బ్రాండ్స్‌ -  లాక్‌-ఇన్‌ ఓపెన్‌ డేట్‌  Oct 10, 2023; మొత్తం ఔట్‌స్టాండింగ్‌ షేర్లు (మిలియన్లలో) 381.7; లాక్‌-ఇన్‌ షేర్లు (మిలియన్లలో) 76.4; 
మొత్తం ఔట్‌స్టాండింగ్‌లో లాక్‌-ఇన్‌ షేర్ల % 20.0; లాక్‌-ఇన్‌ షేర్ల విలువ (మిలియన్‌ డాలర్లలో) 115

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నెమ్మదించిన పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget