By: ABP Desam | Updated at : 11 Mar 2023 12:48 PM (IST)
Edited By: Arunmali
నష్టాల మార్కెట్‌లోనూ లాభాలు సాధించిన 36 స్మాల్ క్యాప్ స్టాక్స్
Small Caps Stocks: వారం ప్రాతిపదికన... బెంచ్‌మార్క్ సూచీలు రెండూ (BSE, NSE) వరుసగా రెండో వారం కూడా 1% పైగా ప్రతికూల రాబడులు అందించాయి.
శుక్రవారం, నిఫ్టీ 1% నష్టంతో 17412.90 పాయింట్ల వద్ద ముగిసింది. 200-డేస్ మూవింగ్ యావరేజ్ (DMA) అయిన 17,434 పాయింట్ల కంటే దిగువన ఉంది. సెన్సెక్స్ 1.1 శాతం నష్టపోయి 59135.13 పాయింట్ల వద్ద ముగిసింది. బెంచ్‌మార్క్ సూచీలు తమ ఆల్-టైమ్ గరిష్టాల నుంచి దాదాపు 8% క్షీణించాయి.
అయితే, గత వారంలో S&P BSE మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు లాభపడ్డాయి, వరుసగా 0.1% మరియు 0.4% చొప్పున సానుకూల వారపు రాబడులు (weekly returns) అందించాయి.
స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో 36 స్టాక్స్ ఈ వారంలో రెండంకెల లాభం కళ్లజూశాయి. వాటిలో... ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్, మంగళూరు కెమికల్స్, సీక్వెంట్ సైంటిఫిక్, జిందాల్ సా, ఉషా మార్టిన్, టిటాగర్ వ్యాగన్స్, డిష్‌మాన్ కార్బోజెన్, జిందాల్ స్టెయిన్‌లెస్, సౌత్ ఇండియన్ బ్యాంక్, నేషనల్ ఫెర్టిలైజర్స్ వంటి ఫేమస్ నేమ్స్ కూడా ఉన్నాయి.
నష్టాల వారంలోనూ రెండంకెల లాభాలిచ్చిన స్మాల్ క్యాప్ స్టాక్స్:
స్టాక్ పేరు: సీమెక్ (Seamec)
వారంలో లాభం: 36%
స్టాక్ పేరు: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ (Olectra Greentech)
వారంలో లాభం: 35%
స్టాక్ పేరు: దీప్ పాలిమర్స్ (Deep Polymers)
వారంలో లాభం: 34%
స్టాక్ పేరు: సీక్వెంట్ సైంటిఫిక్ (SeQuent Scientific)
వారంలో లాభం: 30%
స్టాక్ పేరు: ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ (Asian Energy Services)
వారంలో లాభం: 28%
స్టాక్ పేరు: మంగళూరు కెమికల్స్ (Mangalore Chemicals & Fert)
వారంలో లాభం: 24%
స్టాక్ పేరు: WPIL
వారంలో లాభం: 24%
స్టాక్ పేరు: ఎస్పీవీ గ్లోబల్ టెక్స్‌టైల్స్ (SVP Global Textiles)
వారంలో లాభం: 21%
స్టాక్ పేరు: నేషనల్ ఫెర్టిలైజర్స్ (National Fertilizers)
వారంలో లాభం: 19%
స్టాక్ పేరు: ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ (Privi Speciality Chemicals)
వారంలో లాభం: 19%
స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ షేర్లు టాప్ గెయినర్‌గా నిలిచాయి. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి కుదుర్చుకున్న ఆర్డర్లు ఈ కంపెనీ భవిష్యత్ ఆదాయ చిత్రానికి మరిన్ని మెరుగులు అద్దాయి, కంపెనీ వైఖరిని బలంగా చూపించాయి. 550 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
గత వారం హెడ్‌లైన్స్‌లో నిలిచిన మరో బిగ్ గెయినర్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్. ప్రమోటర్ గ్రూప్‌లో భాగమైన దివంగత గౌతమ్ కులకర్ణి కుటుంబం, ఈ కంపెనీలో భారీ వాటాను విక్రయించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, నోమురా ట్రస్ట్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్, HSBC మ్యూచువల్, DSP మ్యూచువల్ ఫండ్, BNP పరిబాస్, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి అనేక దేశీ & స్వదేశీ పెట్టుబడి కంపెనీలు ఈ వాటాలను కొన్నాయి.
మరో పెద్ద స్టాక్ సీక్వెంట్ సైంటిఫిక్. ఇది వారంలో దాదాపు 30% లాభాలను నమోదు చేసింది. టినెటా ఫార్మాను కొనుగోలు చేసే డీల్‌ను రద్దు చేసుకున్న తర్వాత, దీని బ్యాలెన్స్ షీట్‌కు ఢోకా లేదని ఇన్వెస్టర్లు నమ్మడంతో గత రెండు రోజుల్లో ఈ షేర్లు చాలా లాభపడ్డాయి. టినెటా ఫార్మాను రూ. 218 కోట్లకు కొనుగోలు చేసేందుకు నవంబర్ 2022లో సీక్వెంట్ సైంటిఫిక్ ఒప్పందం చేసుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్, రష్మిక
Stocks to watch 22 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - డివిడెండ్ స్టాక్స్ Hindustan Zinc, SBI Card
Petrol-Diesel Price 22 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు ధరలు - మీ నగరంలో రేటు ఇది
Gold-Silver Price 22 March 2023: చుక్కల్ని దాటిన పసిడి రేటు, ₹75 వేల దగ్గర్లో వెండి
Fraud alert: పేమెంట్ యాప్‌లో డబ్బు పంపి స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారా - హ్యాకింగ్‌కు ఛాన్స్!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి