News
News
వీడియోలు ఆటలు
X

SEBI: పెద్ద శుభవార్త, డీమ్యాట్‌ ఖాతాల్లో నామినేషన్‌ గడువు పెంపు

రిటైల్ క్లయింట్లలో సగానికి పైగా ఇంకా నామినేషన్‌ నిబంధనలను పాటించలేదు.

FOLLOW US: 
Share:

Demat Account Nomination: స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు మార్కెట్‌ నియంత్రణ సంస్ధ సెబీ ఒక పెద్ద శుభవార్త చెప్పింది. ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదార్లు నామినేషన్‌ సమర్పించడానికి లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి గడువును 2023 మార్చి 31 నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

అర్హత గల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల్లో 2023 మార్చి 31న లేదా అంతకుముందే నామినీ పేరును ఇవ్వమని, లేదా నామినీ పేరు ఇవ్వడం ఇష్టం లేదన్న డిక్లరేషన్‌ అయినా ఇవ్వమని గతంలోనే సెబీ సూచించింది. లేదంటే ఆ ఖాతాలు స్తంభించిపోతాయని (frozen) చెప్పింది. అకౌంట్‌ ఫ్రీజ్‌ అయిందంటే, ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో ఒక్క లావాదేవీ కూడా చేయలేరని, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టలేరు, రోజువారీ ట్రేడింగ్‌ చేయలేరని హెచ్చరించింది.  

మన దేశంలో ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల సంబంధిత సేవలు అందిస్తున్న బ్రోకరేజ్‌ సంస్థలు సమర్పించిన లెక్కల ప్రకారం... వారి రిటైల్ క్లయింట్లలో సగానికి పైగా ఇంకా నామినేషన్‌ నిబంధనలను పాటించలేదు. అందుకే ఈ గడువును సెబీ మరోమారు పెంచింది. ఇంతకు ముందు, ఈ నిబంధనను పాటించాల్సిన తేదీ మార్చి 31, 2022. అప్పుడు కూడా ఇదే కారణంతో ఒక సంవత్సరం పాటు, అంటే మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయింది.

నామినేషన్‌ నిబంధన ఎందుకు వచ్చింది?
ఏ వ్యక్తయినా డబ్బు సంపాదించేది అతని కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడానికే. నామినేషన్ పూర్తి చేయకుండా ఒక పెట్టుబడిదారు ఆకస్మాత్తుగా మరణిస్తే, ఆ ఖాతాలోని షేర్లు, డబ్బు అతని కుటుంబ సభ్యులకు చెందవు. నామినీ పేరును చేరిస్తేనే ఆ డబ్బు నామినీకి దక్కుతాయి. పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించేందుకు తెచ్చిన నిబంధన ఇది. ఇప్పటి రోజుల్లో ప్రమాదం ఎటు నుంచి ఎలా ముంచుకువస్తుందో ఎవరికీ తెలీదు. కాబట్టి, గడువు పెంచారులే అని కాలయాపన చేయకుండా, తక్షణం నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.

నామినీ పేరును ఎలా చేర్చాలి?
మీ డీమ్యాట్‌ ఖాతాలో నామినీ పేరును చేర్చడానికి మీరు చేసే దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం, కేవలం 2 రెండు నిమిషాల్లో మీ వైపు నుంచి పని పూర్తవుతుంది. ఆ అప్లికేషన్‌ను ప్రాసెస్‌ చేయడానికి 24-48 గంటల సమయం పడుతుంది. మీ డీమ్యాట్‌ ఖాతాకు గరిష్టంగా ముగ్గురి పేర్లను నామినీలుగా జత చేయవచ్చు, మీ ఇష్టప్రకారం వాళ్లకు నామినేషన్‌ పర్సెంటేజీ ఇవ్వవచ్చు. మొత్తం పర్సంటేజీ కలిపితే 100%కి మించకూడదు. ఒక్కరి పేరునే నామినీగా మీరు చేరిస్తే, ఆ ఒక్కళ్లకే  100% ఇవ్వొచ్చు. ముందుగా, నామినీ పాన్‌, ఆధార్‌ నంబర్‌, ఈ ఆధార్‌ నంబర్‌కు లింక్‌ అయిన రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ మీ దగ్గర పెట్టుకోండి.

మీరు డీమ్యాట్ ఖాతా తీసుకున్న బ్రోకరేజీ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్‌ పేజీలో, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత, ప్రొఫైల్ సెగ్మెంట్‌లోకి వెళ్లండి. ఈ సెగ్మెంట్‌లో కనిపించే నామినీ డిటెయిల్స్‌పై క్లిక్ చేయండి. మీరు ఇంతకు ముందే నామినేషన్‌ పూర్తి చేస్తే ఆ వివరాలు కనిపిస్తాయి. ఎవరి పేరును చేర్చకపోతే ఏ రికార్డ్‌ కనిపించదు. 

నామినీ పేరును గతంలో మీరు జత చేయకపోతే, ఇప్పుడు, ఆ పేజీలో నామినీ వివరాలను నమోదు చేయండి. నామినీ పేరు, పాన్‌, ఆధార్‌ నంబర్‌ పూరించండి. తర్వాత, నామినీకి కేటాయించాలనుకుంటున్న శాతాన్ని పూరించండి. గరిష్టంగా ముగ్గురిని యాడ్‌ చేయవచ్చని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. మీరు కావాలనుకుంటే.. యాడ్‌ నామినీపై క్లిక్‌ చేసి, మరో ఇద్దరి పేర్లను కూడా జోడించవచ్చు.

ఆధార్‌ నంబర్‌ యాడ్‌ చేసి, సెండ్‌ OTP బటన్‌పై క్లిక్‌ చేయండి. ఆధార్‌తో లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు వచ్చిన OTPని సంబంధిత గడిలో పూరించండి.

అంతే, నామినేషన్‌ కూడా దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. 24-48 గంటల్లో మీ డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరు జత అవుతుంది.

Published at : 28 Mar 2023 10:54 AM (IST) Tags: nomination Demat account SEBI Securities And Exchange Board Of India

సంబంధిత కథనాలు

Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు

Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ ఉందేమో చూసుకోండి

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ ఉందేమో చూసుకోండి

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్‌

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Online Banking: అన్ని అవసరాలకు ఒకటే బ్యాంక్ అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?

Online Banking: అన్ని అవసరాలకు ఒకటే బ్యాంక్ అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?