Sahara Refund: సహారా రిఫండ్ పోర్టల్‌లో ఎలా క్లెయిమ్ చేయాలి?, ఇక్కడ క్లిక్ చేస్తే మీ డౌట్సన్నీ క్లియర్ అవుతాయి!
ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ & క్లెయిమ్ చేసుకుంటే, 45 రోజుల్లో రిఫండ్ వస్తుంది.
CRCS-Sahara Refund Portal: సహారా గ్రూప్‌లోని నాలుగు కో-ఆపరేటివ్ సొసైటీల్లో డిపాజిట్లు చేసి నష్టపోయిన కోట్లాది మందికి డబ్బులు తిరిగి చెల్లించేందుకు, 2023 జులై 18న, "CRCS- సహారా రిఫండ్ పోర్టల్"ను (CRCS-Sahara Refund Portal) సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సహారా బాధితులు ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ & క్లెయిమ్ చేసుకుంటే, 45 రోజుల్లో రిఫండ్ వస్తుంది.
పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి ఏమేం అవసరం?
పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి... ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా కచ్చితంగా ఉండాలి. సహారాలో మీ మెంబర్‌షిప్ నంబర్, పెట్టుబడి వివరాలున్న డిపాజిట్ సర్టిఫికెట్/పాస్‌బుక్ సహా అవసరమైన డాక్యుమెంట్లు ఉండాలి. మీ క్లెయిమ్ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే పాన్ నంబర్ ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా లేకున్నా అప్లై చేయవచ్చా?
ప్రస్తుతానికి దీనికి అనుమతి ఇవ్వలేదు. ఆధార్ లింక్‌డ్ బ్యాంక్ అకౌంట్ లేకుండా డిపాజిటర్ క్లెయిమ్ ఫైల్ చేయలేరు. నిజమైన డిపాజిటర్ బ్యాంక్ ఖాతాకు సురక్షితంగా డబ్బు బదిలీ చేయడం కోసమే ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనే రూల్ పెట్టారు.
క్లెయిమ్ ఫారాన్ని ఫైల్ చేయడానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇది పూర్తిగా ఉచితం.
సహారా రిఫండ్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
స్టెప్ 1: https://mocrefund.crcs.gov.in లింక్ ద్వారా రిఫండ్ పోర్టల్‌లోకి వెళ్లండి
స్టెప్ 2: హోమ్ పేజీ మెనూలో కనిపించే Depositor Registration మీద క్లిక్ చేయండి
స్టెప్ 3: 12 అంకెల మెంబర్‌షిప్ నంబర్, మీ ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలు, ఆధార్‌తో లింక్ అయిన 10 అంకెల ఫోన్ నంబర్, క్యాప్చా కోడ్ నింపాలి.
స్టెప్ 4: ఆ తర్వాత, వన్ టైమ్ పాస్‌వర్డ్ కోసం Get OTP మీద క్లిక్ చేయండి
స్టెప్ 5: మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి. దీంతో, మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
సహారా రిఫండ్ పోర్టల్‌లో ఎలా క్లెయిమ్ చేయాలి?
స్టెప్ 1: Depositor Loginపై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు, మీ ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి, Get OTPని క్లిక్ చేయండి.
స్టెప్ 2 ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
స్టెప్ 3: లాగిన్ అయిన తర్వాత, Aadhaar Consent Screen కనిపిస్తుంది. "I Agree" బటన్‌ను క్లిక్ చేసి నిబంధనలు & షరతులను యాక్సెప్ట్ చేయాలి. తర్వాత, నెక్ట్స్ పేజీలోకి వెళ్లండి.
స్టెప్ 4: వ్యక్తిగత వివరాల స్క్రీన్ మీద 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, "Get OTP" క్లిక్ చేయండి. ఆధార్-లింక్డ్ మొబైల్ ఫోన్‌కు OTP వస్తుంది.
స్టెప్ 5: OTPని నమోదు చేసి, Verify OTPపై క్లిక్ చేయండి.
స్టెప్ 6: OTPని ధృవీకరించిన తర్వాత, డిపాజిటర్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, పుట్టిన తేదీ, తండ్రి/భర్త పేరు వంటి వివరాలు కనిపిస్తాయి.
స్టెప్ 7: అలాగే, ఈ-మెయిల్‌ను నమోదు చేసి, Save Emailపై క్లిక్ చేసి, Next బటన్‌ను నొక్కండి.
స్టెప్ 8: ఇక్కడ, స్క్రీన్‌పై కనిపించే విధంగా వివరాలను ఫిల్ చేయాలి.
స్టెప్ 9: Add Claim బటన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ, డిపాజిటర్ మీకు ఉన్న అన్ని క్లెయిమ్ వివరాలను నింపాలి.
స్టెప్ 10: డేటా మొత్తం నమోదు చేసిన తర్వాత, Prefilled Claim Request Form జెనరేట్ చేయండి, ప్రింట్ తీసుకోండి.
స్టెప్ 11: మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను దానిపై అతికించండి. ఆ ఫోటో మీద, క్లెయిమ్ ఫామ్ మీద సంతకం చేయండి.
స్టెప్ 12: ఆ క్లెయిమ్ ఫామ్‌ను, మీ పాన్ కార్డ్ కాపీని స్కాన్ చేసి, Upload Documents స్క్రీన్‌లో అప్‌లోడ్ చేయండి. (క్లెయిమ్ మొత్తం రూ. 50,000 లేదా అంత కంటే ఎక్కువ అయితేనే పాన్ కార్డ్ అవసరం).
క్లెయిమ్ రిక్వెస్ట్ నంబర్‌తో Thank you పేజీ కనిపిస్తుంది. ఇక్కడితో క్లెయిమ్ రిక్వెస్ట్ విజయవంతంగా పూర్తవుతుంది. క్లెయిమ్ రిక్వెస్ట్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
సహారా డిపాజిట్లర్లు రిఫండ్ కోసం అప్లై చేసిన తర్వాత, సహారా గ్రూప్ కమిటీ 30 రోజుల్లో ఆ వివరాలను ధృవీకరించుకుంటుంది. ఆ తర్వాత 15 రోజుల్లో లేదా దరఖాస్తు చేసిన 45 రోజుల లోపు పెట్టుబడిదార్లకు SMS లేదా వెబ్‌సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందుతుంది. క్లెయిమ్ చేసిన డబ్బు నేరుగా డిపాజిటర్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: హమ్మయ్య - ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లపై బ్యాన్ 3 నెలలు వాయిదా
Join Us on Telegram: https://t.me/abpdesamofficial