Russia Crypto News: రష్యా క్రిప్టో ఇన్వెస్టర్లు తగ్గేదే లే! ఏం చేయలేకపోతున్న US ఆంక్షలు
Russia Crypto Investors : రష్యా ఇన్వెస్టర్లు మాత్రం తగ్గేదే లే! అంటున్నారు. అమెరికా, ఐరోపా ఆంక్షలు లెక్క చేయకుండా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేపడుతున్నారు.
Russia Crypto Investors Continue Trading: వెస్ట్రన్ దేశాలు తమ ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధించినా రష్యా ఇన్వెస్టర్లు మాత్రం తగ్గేదే లే! అంటున్నారు. మునుపటి కన్నా ఎక్కువగా బిట్‌కాయిన్ (Bit Coin), ఇతర క్రిప్టో కరెన్సీ (Crypto currency) లావాదేవీలు చేపడుతున్నారు. బ్రిటన్, అమెరికా, ఐరోపా ఆంక్షలు వారిని అడ్డుకోలేకపోతున్నాని బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలిసింది.
రూబుల్ డినామినేటెడ్ బిట్‌కాయిన్ (BTC / RUB) ట్రేడింగ్ వాల్యూమ్ ఈ ఏడాదిలోనే అత్యధిక స్థాయికి శనివారం పెరిగిందని బ్లాక్‌చెయిన్ అనలిటిక్స్ కంపెనీ కియాకో తెలిపింది. మొత్తంగా పెట్టుబడుల వరద మాత్రం కాస్త తక్కువగానే ఉందని పేర్కొంది. ఇక టెథెర్ స్టేబుల్ కాయిన్‌లో రూబుల్ డినామినేటెడ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తోంది.
మార్చి 5న రూబుల్ డినామినేటెడ్ బిట్‌కాయిన్ ట్రేడింగ్ ఎక్కువగా కనిపించిందని కియాకో తెలిపింది. బైనాన్స్‌లో బిట్‌కాయిన్ సగటు ట్రేడ్ పరిమాణం ఫిబ్రవరి 24న పది నెలల గరిష్ఠమైన 580 డాలర్లకు పెరిగింది. ఇదే రోజు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టింది.
యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు అనుసంధానమై, మెసేజ్‌లు పంపించే స్విఫ్ట్ నుంచి ఆ దేశాన్ని నిషేధించాయి. ఇంకా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రష్యా ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ అసెట్లపై పడ్డారు.
'చాలామంది రష్యా ఇన్వెస్టర్లు ఫియట్ ఎక్స్‌పోజర్ నుంచి బయటకు వచ్చి బిట్‌కాయిన్‌ను ట్రేడ్ చేస్తున్నారు. అమెరికా డాలర్‌పై విధించిన ఆంక్షలు యూఎస్‌డీటీ హోల్డర్లకు వర్తించవు. అందుకే కొందరు అదనంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు' అని క్రిప్టో ఆల్గారిథమ్ ట్రేడింగ్ కంపెనీ ఎఫిషియెంట్ ఫ్రంటైర్ మేనేజర్ ఆండ్రూ టూ అంటున్నారు.
కియాకో ప్రకారం బిట్‌కాయిన్ డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ 20 నుంచి 40 బిలియన్ డాలర్ల మధ్య ఉంటోంది. ఇక మార్చి 5న BTC/RUB ట్రేడింగ్ వాల్యూమ్ 14.2 మిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం బైనాన్స్, యోబిట్, లోక్ బిట్‌కాయిన్స్ మాత్రమే రూబుల్ ఆధారిత బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీలను ఆఫర్ చేస్తున్నాయి. మరికొన్ని ఎక్స్‌ఛేంజీలు యుద్ధంతో నేరుగా సంబంధం ఉంటున్న కంపెనీలు, అధికారుల పెట్టుబడులను అంగీకరించడం లేదు.
Also Read: ముడి చమురు బ్యారెల్ ధర 300 డాలర్లకు చేరుతుంది : రష్యా నేత షాకింగ్ కామెంట్స్
Also Read: 75వేల రూపాయల్లోపు రుణం ఉన్న రైతులకు హరీష్ తీపి కబురు
Also Read: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్! 54 వేలకు దగ్గర్లో బంగారం, భగ్గుమన్న వెండి - నేటి ధరలు ఇవీ