By: ABP Desam | Updated at : 24 Dec 2022 12:54 PM (IST)
Edited By: Arunmali
డ్రోన్ & రోబోట్ బిజినెస్ మీద ఫోకస్ పెంచిన అంబానీ
Reliance RSBVL Drone Business: ముకేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలో పని చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd - RIL), తాజాగా డ్రోన్స్ & రోబోట్ బిజినెస్‌లో మరో అడుగు పెట్టింది. రిలయన్స్ ఇప్పటికే డ్రోన్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, రోబోటిక్స్ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత డీల్, ఈ వ్యూహాత్మక బిజినెస్‌లకు సినర్జీ ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ (Reliance Strategic Business Ventures Limited), డ్రోన్స్ & రోబోట్ టెక్నాలజీ మీద పని చేస్తున్న అమెరికన్ కంపెనీ ఎక్సిన్ టెక్నాలజీస్ ఇంక్‌లో (Exyn Technologies Inc) 23.3 శాతం వాటాను కొనుగోలు చేసింది. 25 మిలియన్ డాలర్లకు, అంటే రూ. 207 కోట్లకు ఈ రెండు కంపెనీల్లో డీల్ జరిగింది.
ఎక్సిన్ టెక్నాలజీస్ ప్రత్యేకత ఏంటి?
GPS (Global Positioning System) లేదా ఇతర నావిగేషన్ల అవసరం లేకుండానే, క్లిస్టమైన భూ భాగాలు, కష్టతరమైన మార్గాల్లో డ్రోన్స్, రోబోట్‌లను నడిపించగల సాంకేతికతను అభివృద్ధి చేయడంలో సహాయపడే సంస్థ ఎక్సిన్ టెక్నాలజీస్. ఈ భాగస్వామ్యంతో, ఈ రెండు కంపెనీలు సాంకేతికత & వాణిజ్య స్థాయుల్లో భాగస్వాములు కానున్నాయి. దీనివల్ల, రాబోయే కాలంలో ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది.
గతంలో, మన దేశానికి చెందిన డ్రోన్ మేకర్ ఆస్టెరియా ఏరోస్పేస్ (Asteria Aerospace), గ్లోబల్ రోబోట్ మేకర్ అయిన యాడ్‌వెర్బ్ టెక్నాలజీస్‌లోనూ (Addverb Technologies) రిలయన్స్ ఇండస్ట్రీస్ మెజారీటీ వాటాలు కొనుగోలు చేసింది.
వరుస కొనుగోళ్లతో రిలయన్స్ దూకుడు
ఇది కాకుండా, రిలయన్స్ జియోలో భాగమైన రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ (RPPMSL), రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ విషయం గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు అనుబంధ సంస్థ. ఇది, ముకేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ చేతితో ఉండేది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ అనిల్ అంబానీ కంపెనీని, అన్న ముకేష్ అంబానీ కొనుగోలు చేశారు. మరోమాటలో చెప్పాలంటే చేయూత అందించారు.
భారతదేశంలో జర్మన్ సంస్థ నిర్వహిస్తున్న Metro AG హోల్‌సేల్ వ్యాపారాన్ని (మెట్రో క్యాష్ అండ్ క్యారీ) కూడా, రూ. 2,850 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయబోతోంది. ఇందుకోసం కచ్చితమైన ఒప్పందం (definite deal) మీద ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. కొత్త సంవత్సరంలో (2023) మార్చి నాటికి ఈ లావాదేవీ పూర్తి కావచ్చని అంచనా.
మన దేశంలో మెట్రో బిజినెస్ 2003లో ప్రారంభమైంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని 21 నగరాల్లో 31 పెద్ద ఫార్మాట్ స్టోర్లు ఉన్నాయి. దీనిది హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్. చిన్న, పెద్ద కిరాణా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, కంపెనీలు, ఆఫీసులు వంటి వాటికి మాత్రమే హోల్‌సేల్ ధరలకు ఇది సరుకులు అమ్ముతుంది. బిజినెస్ లైసెన్స్‌ల ఆధారంగా మెట్రో కార్డ్ జారీ చేస్తుంది. ఈ కార్డ్ ఉన్నవాళ్లకే సరుకులు అమ్ముతుంది. ఈ స్టోర్లలో కొనుగోళ్ల కోసం దాదాపు 30 లక్షల మంది ఖాతాదారులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 10 లక్షల మంది తరచూ కొనుగోళ్లు చేసేవాళ్లే. ఇప్పుడు, వీళ్లంతా రిలయన్స్ గుప్పిటలోకి వస్తారు. పైగా, రిటైల్ కిరాణా దుకాణాలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవచ్చు.
Stock Market News: ఆఖరి రోజు అదుర్స్! రిలయన్స్ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్
April Rules: ఏప్రిల్ నుంచి మారే 7 రూల్స్ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను
UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?
Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్!
Small Savings: కేవలం కొన్ని గంటలే - పొదుపు పథకాలపై శుభవార్త వినవచ్చు!
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు