అన్వేషించండి

Reliance Jio : తెలుగు రాష్ట్రాల్లో జియో దూకుడు.. ఆ కేటగిరీలో తగ్గేదేలే, మరి ఎయిర్‌టెల్‌ పరిస్థితి ఏంటీ?

Reliance Jio : తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో దూకుడు స్వభావాన్ని ప్రవర్తిస్తోంది. జియో వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్ కేటగిరీ 4శాతం వృద్ధిని సాధించింది.

Reliance Jio : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ జియో ఆధిపత్యం చెలాయిస్తోంది. వైర్‌లైన్ టెలికాం రంగం (AP టెలికాం సర్కిల్) అక్టోబర్ 2024లో గణనీయమైన వృద్ధిని సాధించింది. అందులో ముఖ్యంగా రిలయన్స్ జియో అగ్రగామిగా నిలిచింది. నెల నెలా కస్టమర్లను పెంచుకుంటూ రికార్డులు సృష్టిస్తోన్న జియో.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తోంది. 69,930 కొత్త కనెక్షన్‌లు వచ్చినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెలియజేసింది. 

జియో వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్ సెప్టెంబర్ 2024లో 17,49,696 నుంచి అక్టోబర్ 2024లో 18,19,626కి పెరిగింది. అలా ఒక్క నెలలోనే 4% వృద్ధిని సాధించింది. అత్యంత డైనమిక్ AP టెలికాం సర్కిల్‌లోని కస్టమర్‌లను ఆకర్షించడానికి జియో దూకుడు వ్యూహం, అత్యాధునిక సాంకేతికత, పోటీ ధరలు చాలా  ఉపయోగపడిందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

వైర్‌లైన్ మార్కెట్‌లో కమాండింగ్ వాటా

రిలయన్స్ జియో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వైర్‌లైన్ మార్కెట్‌లో కమాండింగ్ వాటాను కలిగి ఉంది. మార్కెట్ లీడర్‌గా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. కంపెనీ పనితీరు అన్ని సర్వీస్ ప్రొవైడర్లలో ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడమే కాకుండా బలమైన కనెక్టివిటీ సొల్యూషన్స్, నమ్మకమైన సర్వీస్ క్వాలిటీతో విభిన్న కస్టమర్ అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కూడా హైలైట్ చేస్తుంది.

Reliance Jio : తెలుగు రాష్ట్రాల్లో జియో దూకుడు.. ఆ కేటగిరీలో తగ్గేదేలే, మరి ఎయిర్‌టెల్‌ పరిస్థితి ఏంటీ?

ఇతర కంపెనీల విషయానికొస్తే..

అదే నెలలో, భారతీ ఎయిర్‌టెల్ 15,655 మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించింది. వొడాఫోన్ ఐడియా దాని వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్‌లో క్షీణతను చవిచూసింది. దీంతో కంపెనీ సంఖ్యలు సెప్టెంబర్ 2024లో 1,03,875 నుంచి అక్టోబర్ 2024 నాటికి 92,835కి పడిపోయాయి. ఫలితంగా 11,040 మంది సబ్‌స్క్రైబర్‌లు నష్టపోయిది.    

కస్టమర్లకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్  

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. జియో రీఛార్జ్ రేట్లను తగ్గించేందుకు అడుగులు వేసింది. ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పించేందుకు, ఉన్న కస్టమర్లు కాపాడుకునేందుకు అదిరిపోయే ప్లాన్‌ ప్రకటించింది. జియో 6 నెలల(200 రోజులు)కు గానూ రూ.2025 రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఇలా జియో తన 49 కోట్ల మంది కస్టమర్లకు నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. 200 రోజులకుగానూ రూ.2025 రీఛార్జ్‌తో అపరిమిత కాల్స్, 500 జీబీ హై-స్పీడ్ డేటాతో రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ 200 రోజుల చెల్లుబాటుతో ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దాంతో పాటు రోజుకు 100 ఉచిత SMSలు పొందుతారు. అలా ఆరు నెలల కాలానికి 500 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 

వండర్ ల్యాండ్ లో ఉత్సవాలు

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈఎస్ఏ ప్రోగ్రాంలో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని దాదాపు వెయ్యి మంది చిన్నారులతో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ కహానీ, కాలా, ఖుషీ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు ఆటలు, క్విజ్ పోటీలు నిర్వహించింది. 

Also Read : Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget