అన్వేషించండి

RBI MPC Meet: అంటే.. మరోసారి వడ్డీరేట్ల వడ్డింపు తప్పదన్నమాట! వచ్చేవారం ఆర్బీఐ సమీక్ష

Rbi repo rate 2022: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరోసారి కీలక వడ్డీరేట్లను సవరించనుందని సమాచారం. వచ్చే వారం జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో 0.40 శాతం వడ్డీరేటు పెంచే అవకాశం ఉందని....

RBI MPC Meet on June 6-8 Know How Much Interest Rates May Increase Check Details: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరోసారి కీలక వడ్డీరేట్లను సవరించనుందని సమాచారం. వచ్చే వారం జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో 0.40 శాతం వడ్డీరేటు పెంచే అవకాశం ఉందని ఓ విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తోంది. ఆగస్టులో జరిగే సమీక్షలో 0.35 శాతం పెంచుతుందని లేదా మొత్తంగా 0.50 శాతానికి తీసుకెళ్లి ఆగస్టులో మరో 0.25 శాతం పెంచొచ్చని అంటోంది. మొత్తంగా రేట్ల పెంపును 0.75 శాతానికి తీసుకెళ్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ పేర్కొంది.

Also Read: లోన్‌ తీసుకున్నారా, జస్ట్‌ కూల్‌! EMI భారం కేవలం వీరికి మాత్రమే! మిగతా వాళ్లు సేఫ్‌!

2022, మే 4న రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును 0.40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్కెట్లు నడుస్తుండగా మధ్యాహ్నం సమయంలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే వడ్డీరేట్లను పెంచక తప్పడం లేదని వెల్లడించారు. లక్షిత ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపే ఉంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: ఆర్బీఐ రేట్ల పెంపుతో ఎఫ్‌డీలకు వడ్డీ బెనిఫిట్‌! ఇలా చేస్తేనే ఎక్కువ లాభం.. లేదంటే!

టమాటా ధరల పెరుగుదలతో మే నెల ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉండొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీ తెలిపింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం, క్రూడ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ దిగుమతులపై డ్యూటీ తొలగించడం, ఏటీఎఫ్‌ ధరలు తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని వెల్లడించింది. అయితే మే నెలలో వినియోగదారుల సగటు ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉండొచ్చని, ఆర్బీఐ పెట్టుకున్న 6 శాతం కన్నా ఇది కాస్త ఎక్కువేనని వెల్లడించింది.

Also Read: ప్రజలపై ఆర్‌బీఐ బాదుడే బాదుడు- వడ్డీ రేట్లు పెంపు, EMIలపై ఇక భారం!

'ఆర్బీఐ విధాన రెపోరేటును జూన్‌లో 0.40 శాతం, ఆగస్టులో 0.35 శాతం పెంచుతుందని అంచనా. ప్రామాణిక చర్యల్లో భాగంగా 0.50+0.25 శాతం కాంబినేషన్‌లో పెంచడం కాస్త ఎక్కువే' అని బ్యాంక్‌ ఆఫ్ అమెరికా రిపోర్టు పేర్కొంది. క్యాష్‌ రిజర్వు రేషియో (CRR)ను మరో 0.50 శాతం పెంచొచ్చని అంచనా వేసింది. మేలో సీఆర్ఆర్‌ను 0.50 శాతం పెంచి 4 శాతానికి తీసుకెళ్లడం వల్ల వ్యవస్థ నుంచి రూ.87,000 కోట్ల లిక్విడిటీని సెంట్రల్ బ్యాంక్‌ తగ్గించిందని వెల్లడించింది. ఇక వృద్ధిరేటును 7.4 శాతంగా అంచనా వేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget