అన్వేషించండి

RBI నుంచి కేంద్ర ఖజానాకు కాసుల పంట- డివిడెండ్ రూపంలో రూ.2.11 లక్షల కోట్లు

Indian Government | ప్రతి ఏటా మాదిరిగానే రిజర్వు బ్యాంక్ ఈ ఏడాది సైతం కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఆదాయన్ని అందించేందుకు ఆమోదం తెలిపింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో రూ.2.11 లక్షల కోట్లుగా ఉంది.

RBI Dividend: ప్రతి ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండ్ రూపంలో భారీ మెుత్తాన్ని అందిస్తూ ఉంటుంది. ఆర్బీఐ ఖజానాకు అందించే ఈ భారీ మెుత్తం బడ్జెట్లో వివిధ ఖర్చులకోసం అలకేట్ చేస్తుంటుంది. కేంద్ర వార్షిక బడ్జెట్లో ఆర్బీఐ అందించే డివిడెండ్ సుమారు 3 శాతంగా ఉంటుంది. అయితే ఈసారి అందరూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.లక్ష కోట్లు అంటే దాదాపు 7 బిలియన్ డాలర్లను అందిస్తుందని అంచనా వేశారు. అయితే ఆర్బీఐ ప్రకటించిన గణాంకాలు అందరి మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆమోదం 
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఏకంగా రూ.2.11 లక్షల కోట్లను బదిలీ చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు నేడు ఒక ప్రకటనలో రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ప్రభుత్వానికి మిగులు బదిలీ అనేది బిమల్ జలాన్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్బీఐ ఆగస్టు 26, 2019న ఆమోదించిన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక మెుత్తంలో డివిడెండ్ ఆదాయాన్ని అందించటానికి సెంట్రల్ బ్యాంక్ ఫారెక్స్ హోల్డింగ్ నుంచి వచ్చే అధిక ఆదాయం కారణంగా వెల్లడైంది. 

2025లో ప్రభుత్వ ఖాతాలోకి 
2024-25లో బదిలీ చేయబడిన డివిడెండ్ ప్రభుత్వం మొదట ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉంది. మిగులు బదిలీ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదే అయినప్పటికీ అది.. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుంది. ఇది ప్రభుత్వానికి మెరుగైన లిక్విడిటీని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం 2024-25 సంవత్సరానికి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్‌ను కేటాయించింది. అయితే కేంద్ర ప్రభుత్వ అంచనాకు మించి డబుల్ రాబడిని అందుకుంటోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో విదేశీ సెక్యూరిటీల నుంచి అధిక వడ్డీ ఆదాయాన్ని ఆశించి RBI రూ.85,000 కోట్లు-రూ.లక్ష కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయాలని భావించారు. అయితే అంతిమంగా చెల్లిస్తున్న ఫిగర్ అందరి ఊహలను మించిపోయింది. తాజాగా ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 608వ సమావేశంలో భారీ డివిడెండ్‌ చెల్లింపుకు నేడు ఆమోదం లభించింది.

ఈ సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం. రాజేశ్వర్ రావు, టి.రబీ శంకర్, స్వామినాథన్ జె, సెంట్రల్ బోర్డ్ ఇతర డైరెక్టర్లు - సతీష్ కె. మరాఠే, రేవతి అయ్యర్, ఆనంద్ గోపాల్ మహీంద్రా, వేణు శ్రీనివాసన్, రవీంద్ర హెచ్.ధోలాకియా, పంకజ్ రామన్‌భాయ్ పటేల్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి కూడా హాజరయ్యారని ఆర్బీఐ వెల్లడించింది. 

ఆర్బీఐకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది 
అయితే చాలా మందిలో ఉండే సహజమైన ప్రశ్న అసలు రిజర్వు బ్యాంక్ లాంటి నియంత్రణ సంస్థకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని. అయితే కరెన్సీ ముద్రణ, దేశీయ వాణిజ్య బ్యాంకులకు అందించే రుణాలపై వడ్డీ, ప్రభుత్వ బాండ్ల కొనుగోలు విక్రయం, ఫారెక్స్ ట్రాన్సాక్ష నుంచి వచ్చే కమిషన్ వంటివి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఉదాహరణకు రూ.500 కాగితాన్ని ఆర్బీఐ ముద్రిస్తే దానికి అయ్యే ఖర్చు రూ.10 అనుకుంటే మిగిలిన రూ.490 ఇక్కడ ఆర్బీఐ సంపాదనగా పరిగణించబడుంది. ఈ విధంగా వచ్చే ఆదాయం లక్షల కోట్లకు చేరుకోవటంతో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఎవ్వరూ ఊహించని స్థాయిలో డివిడెండ్ ఆదాయాన్ని పొందింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియోKaloji Kalakshetram in Warangal | ఠీవీగా కాళోజీ కళాక్షేత్రంPushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Embed widget