అన్వేషించండి

Ratan Tata Death Reason: రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?

Fact Behind Ratan Tata Death: రతన్‌ టాటా "లో బీపీ"తో (low blood pressure) ఇబ్బంది పడుతున్నారని ఆయన మరణానికి ముందు వార్తలు వచ్చాయి. అయితే, తన అనారోగ్య వార్తలను ఆయన స్వయంగా ఖండించారు.

Ratan Tata Died At 86 Years Old: రతన్‌ టాటా మరణం టాటా గ్రూప్‌నకే కాదు, యావత్‌ దేశానికీ కచ్చితంగా లోటే. దేశంలోనే అత్యంత విలువైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, వేల కోట్ల ఆస్తిపరుడు అయిన రతన్‌ నావల్‌ టాటా నిశ్చయంగా నిగర్వి, నిరాడంబరుడు, మేధావి, అసమాన నాయకుడు, మార్గదర్శి. వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ, నిరంతరం జన శ్రేయోభిలాషిగానే బతికారు. తనను విమర్శించిన వాళ్లకు కూడా మేలు చేసి అజాతశత్రువులా నిలిచారు. మనసా, వాచా, కర్మణా మహోన్నతుడైన రతన్‌ టాటా, 86 ఏళ్ల వయసులో శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

రతన్‌ టాటా మరణానికి ముందు, అక్టోబర్ 7న, నేషనల్‌ మీడియా నివేదికల ప్రకారం, ప్రముఖ పారిశ్రామికవేత్త & టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ (Tata Group Former Chairman) రతన్‌ టాటా "లో బ్లడ్‌ప్రెజర్‌"తో బాధపడ్డారు. చికిత్స కోసం ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ICUలో రతన్‌ టాటాను అడ్మిట్‌ చేశారు. అయితే, అదే రోజున, సోషల్ మీడియా పోస్ట్‌లో, ఆ వార్తలను రతన్‌ టాటా తోసిపుచ్చారు. 

కేవలం వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ముంబై ఆసుపత్రిలో చేరానని, తాను బాగానే ఉన్నాడని X పోస్ట్‌లో చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన గురించి ఆలోచించినందుకు అందరికీ ధన్యవాదాలు అని రాశారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆయన ప్రజలను, మీడియాను కోరారు. విషాదం ఏంటంటే, ఇది జరిగిన రెండు రోజులకే రతన్ టాటా మరణించారు.

రతన్ ఎన్ టాటా (86), బుధవారం (09 అక్టోబర్‌ 2024) రాత్రి 11.30 గంటల సమయంలో, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణవార్త యావత్‌ దేశాన్ని కుదిపేసింది. టాటా గ్రూప్‌ ఉద్యోగులు, అభిమానులు, ఆయన నుంచి సాయం పొందినవాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చేరదీసిన శునకం కూడా మౌనంగా నివాళి అర్పించింది. రతన్ టాటా మృతిపై దేశ & అంతర్జాతీయ ప్రముఖులు స్పందించారు. అసమాన నాయకుడిని & మారదర్శిని కోల్పోయామంటూ బాధను వ్యక్తం చేశారు.

రతన్‌ టాటా ఎలా చనిపోయారు, ఆయన మరణానికి అసలు కారణం ఏంటి?

రతన్‌ టాటా చనిపోవడానికి రెండు రోజుల ముందు, అక్టోబర్‌ 7 నాటి మీడియా కథనాలే చివరకు నిజమయ్యేలా ఉన్నాయి. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలకు లో బ్లడ్‌ప్రెజర్‌ తోడవడం వల్ల ఆయన చనిపోయినట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

అకస్మాత్తుగా రక్తపోటు తగ్గినప్పుడు ఏం జరుగుతుంది?

తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇదొక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇతర ప్రాణాంతక పరిస్థితులకు ఇది కారణమవుతుంది, ముఖ్యంగా పెద్దల్లో ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తుంది. దీనిని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఈ పరిస్థితిని సాధారణంగా గుర్తించలేరు. హైపోటెన్షన్‌కు చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది.

అకస్మాత్తుగా BP పడిపోయినప్పుడు శరీరంలో అసలు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. హై బీపీ లాగానే, రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదలను (లో బీపీ) కూడా సమయానికి నియంత్రించాలి. లేకపోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. 

రక్తపోటులో ఆకస్మిక తగ్గుదల ఇలాంటి లక్షణాలకు దారి తీస్తుంది:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా తక్కువ సందర్భాల్లోనే రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే, ఇది మెదడు సహా శరీరంలోని ఇతర కీలక అవయవాలకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. తద్వారా హార్ట్‌ స్ట్రోక్ (గుండెపోటు) వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

ఇది కూడా చదవండి: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా? 

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget