PM Narendra Modi: పెరిగిన పెట్రోల్, ఆహారం ధరలు - ప్రధాని మోదీ ఆందోళన!
PM Narendra Modi: ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19, సహజ విపత్తులు మనపై ఆర్థిక ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు.
PM Narendra Modi:
ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19, వాతావరణ మార్పులతో వస్తున్న సహజ విపత్తులు మనపై ఆర్థిక ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. 'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్' వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు రోజుల ఈ సదస్సుకు భారతే ఆతిథ్యమిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన అంతర్జాతీయ సమస్యలు, ఆహారం, ఇంధన ఉమ్మడి సమస్యలపై ఇందులో విస్తృతంగా చర్చించనున్నారు.
Sharing my closing remarks at the "Voice of Global South Summit." https://t.co/WXB56kElFZ
— Narendra Modi (@narendramodi) January 12, 2023
ప్రపంచం ఇప్పుడు సంక్షోభ పరిస్థితుల్లో ఉందని మోదీ అన్నారు. ఈ అస్థిరత ఎన్నాళ్లు కొనసాగుతుందో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు, యుద్ధాలు, తీవ్రవాదం వంటి సమస్యలే ఇందుకు కారణమని వెల్లడించారు.
'ప్రపంచం సంక్షోభంలో ఉందన్నది స్పష్టం. ఇదెంత కాలం కొనసాగుతుందో తెలియదు. మన దక్షిణాది దేశాలకే భవిష్యత్తులో ఎక్కువ వాటా ఉంటుంది. మనం ఎలాంటి అంతర్జాతీయ సమస్యలను సృష్టించలేదు. కానీ అవి మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి' అని ఆయన వెల్లడించారు.
Addressing the inaugural session of "Voice of Global South Summit." https://t.co/i9UdGR7sYH
— Narendra Modi (@narendramodi) January 12, 2023
ఈ సదస్సులో ఆసియా, ఆఫ్‌రికా, దక్షిణ అమెరికా దేశాలు పాల్గొన్నాయి. మానవుల కేంద్రంగా అభివృద్ధి కోసం గ్లోబల్ సౌత్ గొంతుక థీమ్‌తో మొదట చర్చించనున్నారు. సమష్టి లక్ష్యం కోసం సమష్టి గొంతుక థీమ్‌పై ఆఖర్లో ప్రపంచ దేశాధినేతలు మాట్లాడతారు. మొత్తం పది సెషన్లు ఉంటాయి. గురువారం నాలుగు, శుక్రవారం ఆరు జరుగుతాయి. ప్రతి సెషన్లో 10-20 దేశాల నేతలు, మంత్రులు పాల్గొంటారని అంచనా.
Also Read: 5Paisa Capital Q3 Results: కంపెనీ కొంచం - లాభం ఘనం, ఉరుకులు పెట్టిన షేర్ ధర
View this post on Instagram