(Source: ECI/ABP News/ABP Majha)
Petrol-Diesel Price 22 January 2022: వాహనదారులకు ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగిన రేట్లు
Petrol Price Today 22 January 2022: హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
Petrol Price Today 22 January 2022: హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ తొలి వారం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 22 పైసలు తగ్గగా లీటర్ ధర రూ.107.69 అయింది. డీజిల్‌పై 20 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.34 కి పతనమైంది. వరంగల్ రూరల్ జిల్లాలో 16 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.91 కాగా, డీజిల్‌పై 15 పైసలు తగ్గి లీటర్ ధర రూ.94.34గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర 32 పైసలు తగ్గడంతో నేడు లీటర్ ధర రూ.108.25 కాగా, 30 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.95 అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ పై రూ.0.58 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.27 అయింది. డీజిల్ ధర రూ.0.53 పైసలు పెరగడంతో రూ.96.54 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌పై 16 పైసలు పెరిగి లీటర్ ధర రూ.110.51 అయింది. ఇక్కడ డీజిల్ పై 15 పెరగడంతో లీటర్ ధర రూ.96.59 అయింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.31 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.36 అయింది. డీజిల్ పై 0.29 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.47 కు చేరింది.
చిత్తూరు జిల్లాలో ధరలు..
చిత్తూరులోనూ ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. లీటరుపై 59 పైసలు తగ్గడంతో పెట్రోలు ధర ప్రస్తుతం రూ.110.44 కి దిగొచ్చింది. ఇక డీజిల్ ధర రూ.0.55 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.47 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సరం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు