News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Petrol-Diesel Price, 8 February: ఇక్కడ భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, మిగతా నగరాల్లో హెచ్చుతగ్గులు, ఇవాల్టి ధరలు ఇవీ..

తిరుపతిలో ఇంధన ధరలు నేడు భారీగా తగ్గాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.2.22 పైసలు తగ్గి రూ.110.12 వద్ద ఉంది.

FOLLOW US: 

గత నాలుగు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 90 డాలర్ల మార్కును దాటాయి. దీంతో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత వారం రోజుల తర్వాత నేడు ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు (ఫిబ్రవరి 8) పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.25 పైసలు పెరిగి రూ.110.41 గా ఉంది. డీజిల్ ధర రూ.0.24 పైసలు పెరిగి రూ.96.68 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.52 పైసలు పెరిగి రూ.111.17గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.51 పైసలు పెరిగి రూ.97.20 గా ఉంది.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. లీటరు ధర రూ.0.17 పైసలు తగ్గి రూ.109.05 గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు తగ్గి రూ.95.18గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తాజాగా తగ్గాయి.

తిరుపతిలో భారీగా తగ్గిన ధరలు.. 
తిరుపతిలో ఇంధన ధరలు నేడు భారీగా తగ్గాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.2.22 పైసలు తగ్గి రూ.110.12 వద్ద ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర తాజాగా రూ.2.00 పైసలు తగ్గి రూ.96.18 కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఫిబ్రవరి 8 నాటి ధరల ప్రకారం 90.97 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.

Published at : 08 Feb 2022 07:10 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: అనూహ్య నష్టాల్లో బిట్‌కాయిన్‌! క్రిప్టోలన్నీ నేల చూపులే!

Cryptocurrency Prices: అనూహ్య నష్టాల్లో బిట్‌కాయిన్‌! క్రిప్టోలన్నీ నేల చూపులే!

Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు! 60K పైనే సెన్సెక్స్‌, 18Kకు స్వల్ప దూరంలో నిఫ్టీ

Stock Market Closing: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు! 60K పైనే సెన్సెక్స్‌, 18Kకు స్వల్ప దూరంలో నిఫ్టీ

Top Loser Today August 17, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

Top Loser Today August 17, 2022 స్టాక్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ లాసర్స్‌ జాబితా

టాప్‌ గెయినర్స్‌ August 17, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

టాప్‌ గెయినర్స్‌ August 17, 2022 : స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌

RBI on Payment Systems: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!

RBI on Payment Systems: గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!

టాప్ స్టోరీస్

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Rajinikanth as Governor:   రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ !  బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!